Asianet News TeluguAsianet News Telugu

శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్ మ్యాజిక్... ఇండియా ఏ చేతుల్లో న్యూజిలాండ్ ఏ చిత్తు...

INDA vs NZA 1st ODI: న్యూజిలాండ్ ఏతో తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత ఏ జట్టు... నాలుగు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్! కుల్దీప్ సేన్‌కి 3 వికెట్లు... 

India A beat New Zealand A by 7 wickets in the first One-Day, Shardul Thakur picks four
Author
First Published Sep 22, 2022, 4:47 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన భారత ప్లేయర్లు... ప్రస్తుతం యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఇండియా ఏ తరపున న్యూజిలాండ్ ఏతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. చెన్నైలో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత ఏ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏ జట్టు, భారత బౌలర్ల ధాటికి 40.2 ఓవర్లలో 167 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఓపెనర్ బోవ్స్‌ని శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. 

10 పరుగులు చేసిన రచిన్ రవీంద్రను కుల్దీప్ సేన్ అవుట్ చేయగా 4 పరుగులు చేసి డేన్ క్లేవర్‌ని శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. జో కార్టర్ 1, రాబర్ట్ ఓడొనెల్ 22 పరుగులు చేసి అవుట్ కాగా టామ్ బ్రూస్ డకౌట్ అయ్యాడు...

వాన్ బీక్ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 74 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ ఏ జట్టు. ఈ దశలో మైకేల్ రిప్పాన్, జో వాకర్ కలిసి 9వ వికెట్‌కి 89 పరుగులు జోడించారు.49 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన జో వాకర్‌ని రజత్ పటిదార్ రనౌట్ చేయగా 104 బంతుల్లో 4 ఫోర్లతో 61 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 8.2 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 32 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కుల్దీప్ సేన్ 7 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ వికెట్ తీయకపోయినా 7 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 27 పరుగులు మాత్రమే ఇచ్చి మెప్పించాడు...

168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 31.5 ఓవర్లలో ఛేదించింది భారత ఏ జట్టు. పృథ్వీ షా 24 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు...

రాహుల్ త్రిపాఠి 40 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరగా సంజూ శాంసన్, రజత్ పటిదార్ కలిసి మ్యాచ్‌ని ముగించారు. రజత్ పటిదార్ 41 బంతుల్లో 7 ఫోర్లతో 45 పరుగులు చేయగా సంజూ శాంసన్ 32 బంతుల్లో ఓ ఫోర్,3  సిక్సర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇరు జట్ల రెండో అనధికారిక వన్డే సెప్టెంబర్ 25న ఆదివారం జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios