మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు... రోహిత్ సేనకు వరుసగా 11వ విజయం..
184 పరుగుల భారీ టార్గెట్... 1 పరుగుకే కెప్టెన్ రోహిత్ అవుట్, గత మ్యాచ్‌లో ఇరగదీసిన ఇషాన్ కిషన్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయినా లంకకి విజయం దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ మరో హాఫ్ సెంచరీకి తోడు సంజూ శాంసన్, రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది భారత జట్టు..
184 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 1 పరుగుకే ఛమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది లంక...
15 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, లహిరు కుమార బౌలింగ్‌లో శనకకి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కి నాలుగో వికెట్‌కి 84 పరుగులు జోడించాడు సంజూ శాంసన్...
25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన సంజూ శాంసన్, లహిరు కుమార బౌలింగ్‌లో బినుర ఫెర్నాండో పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జడేజా, శ్రేయాస్ అయ్యర్ కలిసి మ్యాచ్‌ను ముగించేశారు. శ్రేయాస్ అయ్యర్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా 56 పరుగులు జోడించారు
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు దనుష్క గుణతిలక, పథుమ్ నిస్సంక కలిసి శుభారంభం అందించారు...
తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దనుష్క గుణతిలక వికెట్ కోల్పోయింది శ్రీలంక. 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన దనుష్క గుణతిలక, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత చరిత్ అసలంక 5 బంతుల్లో 2 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా కమిల్ మిశార 4 బంతుల్లో ఒకే పరుగు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ిచ్చి పెవిలియన్ చేరాడు...
తొలి టీ20 మ్యాచ్‌లో క్యాచులు డ్రాప్ చేసిన శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, నేటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడం విశేషం.. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన వికెట్ కీపర్ దినేశ్ చండీమల్... బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు....
చండీమల్ క్యాచ్‌తో టీ20ల్లో 50 క్యాచులు అందుకున్న మొట్టమొదటి భారత ఫీల్డర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 43 క్యాచులతో రెండో స్థానంలో ఉండగా, సురేష్ రైనా టీ20ల్లో 42 క్యాచులు అందుకున్నాడు...
102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ పథుమ్ నిస్సంక, కెప్టెన్ దసున్ శనక కలిసి ఐదో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన పథుమ్ నిస్సంక, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత కెప్టెన్ దసున్ నిశ్శంక 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి లంకకి భారీ స్కోరు అందించాడు.
