South Africa vs India, 2nd Test Live: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌రుగుతున్న భార‌త్-సౌతాఫ్రికా రెండో టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న స‌ఫారీల‌ను భార‌త బౌల‌ర్ల‌లు ఆరంభంలోనే దెబ్బ‌కొట్టారు. సిరాజ్ బౌన్సుల‌తో అద‌ర‌గొట్టాడు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. 

South Africa vs India, 2nd Test: భార‌త్ vs ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా బుధ‌వారం రెండో టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. భార‌త్ బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. దీంతో 50 ప‌రుగులకే సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయింది. మన బౌలర్లు బౌన్సులతో విరుచుకుపడుతూ.. తొలి సెషన్ లో భారత్ కు మంచి శుభారంభం అందించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ల‌ను త‌న బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. త‌న అద్భుత బౌలింగ్ తో సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు.

తొలి సెష‌న్ లో ఏడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్న సిరాజ్.. రెండో సెష‌న్ లో మూడు వికెట్లు తీశాడు. ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గ‌ర్, టోనీ డి జోర్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్కో జాన్సెన్, కైల్ వెర్రేన్నేల‌ను సిరాజ్ ఔట్ చేశాడు. అలాగే, భార‌త సేస‌ర్ జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ భారత్‌కు మంచి ఆరంభం అందించాడు. ఇక‌ సిరాజ్ వేసిన బంతికి స్లిప్‌లో యశస్వి జైస్వాల్ అద్భుత క్యాచ్ పట్టాడు. యశస్వి జైస్వాల్ ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి సిరాజ్ఆఫ్ స్టంప్ దగ్గర ఫుల్లర్ బాల్ వేశాడు, ఐడెన్ మార్క్‌రామ్ ఈ బంతిని డిఫెండ్ చేయడానికి వెళ్ళాడు, అయితే బంతి బ్యాట్ ఔటర్ ఎడ్జ్‌ను తీసుకొని థర్డ్ స్లిప్‌కు వెళ్లింది, అక్కడ యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

Scroll to load tweet…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. టార్గెట్ ఐపీఎల్ 2024 టైటిల్ !