టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేవలం భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెడితే... పరుగల వరద కురిపించడంలో ఆయనకు ఆయనేసాటి. పరుగల యంత్రం అంటూ ఆయనను అభిమానులు ముద్దుగా  పిలుచుకుంటారు. క్రికెట్ లో ఎంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలో కూడా కోహ్లీ అంతే చురుకుగా ఉంటాడు.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. వాటికి లక్షల్లో లైకులు, కామెంట్స్ వచ్చిపడుతుంటాయి. ఎప్పుడూ  స్టైలిష్ లుక్ లోనో, ఫిట్ నెస్ కి సంబంధించినవో.. లేదా తన అందాల భార్యతో దిగిన ఫోటోలనో షేర్ చేసే కోహ్లీ ఈసారి అందరినీ భయపెట్టే ఫోటో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోని చూసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read ఆర్సీబీ కొత్త లోగో... చూసి షాకైన కోహ్లీ...

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు చూసి అభిమానులు జడుసుకున్నారు. తన సహచరులు పృథ్వీషా, మహ్మద్ షమీతో కలిసి ఉన్న ఈ ఫొటోలు సాధారణ ఫొటోల్లా లేవు. ముగ్గురి కళ్లు విచిత్రంగా పైకి తిప్పి, నాలుక బయటపెట్టి ఉన్నాయి. దీనికి కోహ్లీ ‘నయా పోస్ట్.. సుందర్ దోస్త్’ అని క్యాప్షన్ తగిలించాడు.

 

కోహ్లీ ట్వీట్ చూసిన వెంటనే అభిమానులు రెడీ అయిపోయారు. ఈసారి మీమ్‌లకు ఈ ఫొటో అచ్చుగుద్దినట్టు సరిపోతుందని ట్వీట్లు మొదలుపెట్టారు. తర్వాతి మీమ్ మెటీరియల్ ఇదేనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాదు, రకరకాల వీడియోలు, ఫొటోలతో ట్విట్టర్‌ను నింపేస్తున్నారు.