IND vs NZ semi final: టాస్ గెలిచిన టీమిండియా... రివెంజ్ తీర్చుకుంటుందా?

ICC World cup 2023 INDvsNZ semi final:  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వరుసగా ఆరో మ్యాచ్‌లో మార్పులు లేకుండా బరిలోకి..  

IND vs NZ semi final: Team India won the toss and elected to bat first, India vs New Zealand CRA

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లీగ్ స్టేజీలో మొదటి ఐదు మ్యాచుల్లో ఛేదించి విజయాలు అందుకున్న టీమిండియా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి విజయాలు అందుకుంది.

అదీకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 18 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ కారణంగానే టాస్ గెలవగానే రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత ఐదు మ్యాచుల్లో కొనసాగించిన జట్టునే, నేటి మ్యాచ్‌లో కూడా ఆడిస్తోంది టీమిండియా.. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ జట్టు: డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియంసన్ (కెప్టెన్), డార్ల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios