IND vs ENG : స్టార్ ప్లేయ‌ర్ దూరం.. ధ‌ర్మ‌శాల‌లో ఇంగ్లాండ్ తో త‌ల‌ప‌డే భార‌త జ‌ట్టు ఇదే..

India vs England:  ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్ లు జ‌ర‌గ్గా, భార‌త్ మూడు మ్యాచ్ ల‌లో గెలిచి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 
 

IND vs ENG : Star Player Out.. This is india's team against England in 5th Test Dharamsala RMA

Team india - Dharamshala Test : ధర్మశాలలో మార్చి 7 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న ఐదో టెస్టుకు స్టార్ బ్యాట్స్ మ‌న్ కేఎల్ రాహుల్ దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫిబ్రవరి 29న (గురువారం) ప్రకటించింది. క్వాడ్రిసెప్స్ గాయంతో ఇంగ్లాండ్ తో భారత్ తొలి టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ను ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుండగా, లండన్ లోని వైద్య‌ నిపుణులతో సంప్రదింపులు జ‌రుపుతున్న‌ట్టు పేర్కొంది.

"ఫిట్ నెస్ కు లోబడి చివరి ఐడీఎఫ్సీ టెస్టులో పాల్గొన్న కేఎల్ రాహుల్ ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అతని సమస్య తదుపరి నిర్వహణ కోసం లండన్ లోని వైద్య‌ నిపుణులతో సమన్వయం చేస్తోందని" బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా

ధర్మశాలలో జరిగే భార‌త్-ఇంగ్లాండ్ ఐదో టెస్టుకు కుడిచేతి వాటం పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పనిభారం కారణంగా బుమ్రాను నాలుగో టెస్టుకు భారత జట్టు నుంచి తప్పించారు. ఒక టెస్టు విశ్రాంతి ఇచ్చారు. రాంచీలో జరిగిన‌ నాలుగో టెస్టుకు జట్టు నుంచి విడుదలైన జస్ప్రీత్ బుమ్రా ఐదో టెస్టు కోసం ధర్మశాలలో టీమిండియాలో చేర‌నునున్నాడు.

వాషింగ్టన్ సుందర్ ఔట్

ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టు నుంచి త‌ప్పించారు. ఈ యంగ్ ప్లేయ‌ర్ రంజీ ట్రోఫీ ఫైనల్ కోసం తన తమిళనాడు జట్టులో చేరనున్నాడు. 'వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి తప్పించారు. మార్చి 2, 2024 నుండి ముంబైతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం అతను తమిళనాడు టీమ్ లో చేరతాడు. అవసరమైతే ఐదో టెస్టు కోసం దేశవాళీ మ్యాచ్ ముగిసిన తర్వాత అతను భారత జట్టులో చేరుతాడు' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇంగ్లాండ్ తో 5వ టెస్టుకు భార‌త్ జ‌ట్లు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవ్ ద‌త్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

ఇషాన్ కిషన్-శ్రేయాస్ అయ్యర్ లు బీసీసీఐ కాంట్రాక్టులను ఎందుకు కోల్పోయారు?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios