విజయం సాధించడానికి ఇంగ్లాండ్ కి అవకాశం ఉన్నప్పటికీ చేజార్చుకుందని షేన్ వార్న్ పేర్కొన్నారు. ఈ సమయంలో.. భారత్ చేసిన ప్రయత్నాన్ని తాను సమర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో చివరకు విజయం భారత్ కే దక్కింది. అయితే.. ఈ మ్యాచ్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజయం సాధించడానికి ఇంగ్లాండ్ కి అవకాశం ఉన్నప్పటికీ చేజార్చుకుందని షేన్ వార్న్ పేర్కొన్నారు. ఈ సమయంలో.. భారత్ చేసిన ప్రయత్నాన్ని తాను సమర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Scroll to load tweet…

టీమిండియా మ్యాచ్ ని డ్రా చేయాలని లేదా విజయం సాధించాలని ప్రయత్నించిందని.. వారి ప్రయత్నాన్ని తాను సమర్థిస్తున్నట్లు షేన్ వార్న్ పేర్కొన్నారు. ఇంగ్లాడ్ జట్టుు వ్యూహాలు చాలా భయంకరంగా ఉన్నాయని షేన్ వార్న్ పేర్కొన్నారు. ఫెన్స్ వద్ద 5 నుంచి 6 ఫీల్డర్లు వద్దు అని బౌలర్లు ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన ప్రశ్నించారు. బ్యాట్స్ మెన్ పరుగులు ఎలా చేయగలుగుతాడని ప్రశ్నించారు. ఇంగ్లాండ్ గెలవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. భారత్ మాత్రం మ్యాచ్ గెలడానికి లేదా డ్రా చేయడానికి ప్రయత్నించిందన్నారు. 

Scroll to load tweet…

కాగా.. ఈ మ్యాచ్ లో బుమ్రా, షమీ ఆటపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సైతం ఇంగ్లాండ్ టాక్టిక్స్ పై మండిపడ్డారు. బుమ్రా, షమీల ఆటను మెచ్చుకోవడం విశేషం.