India vs England : ధర్మశాల టెస్టు కోసం భారత్- ఇంగ్లాండ్ రెండు జట్లలో మార్పులు జరిగాయి. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ భారత జట్టు తరఫును టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేయగా, ఆకాశ్ దీప్‌కు బదులుగా జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు.
India vs England : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే 3-1 ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్ తో గెలుపుతో సిరీస్ ను ముగించాలనుకుంటోంది.
ధర్మశాలలోని సుందరమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ప్లెయింగ్ 11లో స్వల్ప మార్పులు చేశాయి. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అలాగే, ఆకాశ్ దీప్‌కు బదులుగా జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
100 టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇద్దరు ప్లేయర్లు
వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కు వీడ్కోలు పలకాలని చూస్తోంది. ఇంగ్లాండ్ ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం తమ జట్టును ప్రకటించగా, ఒక మార్పు చేయబడింది. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. ఈ సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 170 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో తన 100 మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
6 బంతుల్లో ఆరు సిక్సర్లు.. మరో భారత ప్లేయర్ సంచలన బ్యాటింగ్ !
కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ భారత్ తరఫున 314వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తన 100వ టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్‌కు క్యాప్పింగ్ ద్వారా టెస్ట్ జట్టులోకి స్వాగతం పలికాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున ఐదుగురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం విశేషం. టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఇది 100వ టెస్టు మ్యాచ్. దీంతో 100వ టెస్టు మ్యాచ్ ఆడిన 14వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.
ధర్మశాల టెస్టు కోసం ఇరు జట్లు (ప్లేయింగ్ 11):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్ (కెప్టెన్), ఫోక్స్, హార్ట్లీ, వుడ్, అండర్సన్, బషీర్.
టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు
