నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, 30 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 9 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్‌లో బంతి అందుకున్న అక్షర్ పటేల్, రెండో బంతికే డొమినిక్ సిబ్లీని పెవిలియన్ చేర్చాడు.

8 బంతుల్లో 2 పరుగులు చేసిన సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 30 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు చేసిన జాక్ క్రావ్లే... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

9 బంతుల్లో ఒక ఫోర్‌తో 5 పరుగులు చేసిన జో రూట్, సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. జానీ బెయిర్‌స్టో 26 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉండగా, బెన్ స్టోక్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు.