వరుస విరామాల్లో వర్షం కురవడంతో మొదటి సెషన్‌ను రద్దు...తగ్గని వర్షం... మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం... 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విజయం సాధించి, సిరీస్ ఆరంభంలోనే ఆధిక్యం సంపాదించాలని ప్రయత్నించిన టీమిండియా ఆశలపై వరుణుడు కుండపోతగా నీళ్లు చల్లుతున్నాడు. నాటింగ్‌హమ్‌లో వర్షం కారణంగా ఐదో రోజు మొదటి సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

వరుస విరామాల్లో వర్షం కురవడంతో మొదటి సెషన్‌ను రద్దు చేసిన అంపైర్లు, లంచ్‌ బ్రేక్‌ను త్వరగా ఇచ్చారు. ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండడం, లక్ష్యం 157 పరుగులే కావడంతో మ్యాచ్ రిజల్ట్ సాధ్యమే.

అయితే మ్యాచ్ రిజల్ట్ రావాలంటే మిగిలిన రెండు సెషన్లు అయినా పూర్తిగా ఆట సాగాలి. అయితే ఇప్పటికీ వర్షం తగ్గకపోవడంతో మిగిలిన రెండు సెషన్లు అయినా ఆట సాగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. 

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఓ రిజర్వు డే ఉండడం వల్ల మ్యాచ్ రిజల్ట్ వచ్చింది. ఇలాగే కొనసాగితే, ఫలితం తేలాలంటే ఇంగ్లాండ్‌లో జరిగే ప్రతీ టెస్టుకి ఓ రిజర్వు డే పెట్టాల్సి ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... రెండో సెషన్‌లోనూ వర్షం తగ్గకపోతే ఐదో రోజును ఆటను రద్దు చేసి, మ్యాచ్‌ డ్రా అయినట్టుగా ప్రకటిస్తారు అంపైర్లు...