ముంబై: తనపై జరిగిన ట్రోలింగ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఘాటు రిప్లై ఇచ్చాడు. ఓ నెటిజన్లు కొంత మంది ఆకాశ్ చోప్రాను విరాట్ కోహ్లీ చెంచాగా అభివర్ణించాడు, ట్విట్టర్ లో కొంత మంది ఆకాశ్ చోప్రాను విరాట్ కోహ్లీ చెంచాగా వ్యాఖ్యానించారు. 

విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ పై ప్రశంసల జల్లు కురిపించిన ఆకాశ్ చోప్రా మనీష్ పాండే పట్టిన క్యాచ్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు. రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో మనీష్ పాండే ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే. 

Also Read: కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా: కళ్లు చెదిరే రీతిలో డైవ్ కొట్టి...

మనీష్ పాండే క్యాచ్ పట్టినప్పుడు తాను కామెంటరీ చెబుతున్నానని, కామెంట్రీ చేబుతూ తాను ట్వీట్ చేయలేనని ఆకాశ్ చోప్రా అన్నాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డే మ్యాచులో గాలిలో ఎగిరి విరాట్ కోహ్లీ బంతిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్న లబూ షేన్ పెవిలియన్ కు చేరుకున్నాడు. 

Also Read: రోహిత్ వారిని చెత్త కింద కొట్టేశాడు: కంగూరులను హేళన చేసిన షోయబ్ అక్తర్

ఆ క్యాచ్ వల్ల ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా ఇండియా అడ్డుకోగలిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్ వల్ల స్టీవ్ స్మిత్, లబూ షేన్ 127 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ క్యాచ్ పై ఆకాశ్ చోప్రా వెంటనే ట్విట్టర్ లో స్పందించాడు. క్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ రెండుసార్లు అద్బుతమైన ఫీల్డింగ్ ద్వారా పరుగులకు అడ్డు కట్ట వేశాడని కూడా ఆయన వ్యాఖ్యానించాడు.