మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత జట్టుపై 54 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆసీస్, వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా మార్కస్ హార్రీస్ 14 బంతుల్లో ఒకే పరుగు చేసి క్రీజులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో369 పరుగులకు ఆలౌట్ కాగా, భారత జట్టు 336 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ కలిసి ఆదుకున్నారు.

ఏడో వికెట్‌కి రికార్డు స్థాయిలో శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని 33 పరుగులకి తగ్గించారు. ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్‌కి 5 వికెట్లు దక్కాయి.