Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 3rd ODI: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... నాలుగు మార్పులతో టీమిండియా..

మయాంక్ అగర్వాల్ స్థానంలో శుబ్‌మన్ గిల్...

చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్... షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్... సైనీ స్థానంలో నటరాజన్...

మూడో వన్డేకి ముందు జట్టులో నాలుగు మార్పులు చేసిన విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు...

IND vs AUS 3rd ODI: Team India wins toss at last in 3rd ODI, elected bat first CRA
Author
India, First Published Dec 2, 2020, 8:49 AM IST

INDvAUS: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఎట్టకేలకు టాస్ గెలిచింది టీమిండియా. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా, 2-0 తేడాత వన్డే సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. చివరి మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది టీమిండియా.

గత రెండు వన్డేల్లో భారీగా పరుగులు ఇచ్చిన బౌలర్ నవ్‌దీప్ సైనీ స్థానంలో ఐపీఎల్ 2020 సెన్సేషన్ యార్కర్ స్పెషలిస్టు టి నటరాజన్ మూడో వన్డేతో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేస్తున్నాడు. అతనితో పాటు మయాంక్ అగర్వాల్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కి, షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి, చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో అవకాశం కల్పించాడు విరాట్ కోహ్లీ.

ఆస్ట్రేలియా తరుపున గాయపడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో కామెరాన్ గ్రీన్ ఆరంగ్రేటం చేస్తేన్నాడు. ఆసీస్ టాప్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా, అతని స్థానంలో సీన్ అబ్బాట్‌కి చోటు కల్పించింది. 

భారత జట్టు:
శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, టి నటరాజన్

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్, లబుషేన్, హెండ్రిక్స్, అస్టన్ అగర్, ఆడమ్ జంపా, హజల్‌వుడ్, సీన్ అబ్బాట్

Follow Us:
Download App:
  • android
  • ios