వికెట్ తీయగానే మైదానం మొత్తం పరుగెత్తుతూ దక్షిణాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ చేసుకునే సెలబ్రేషన్స్ క్రికెట్ వరల్డ్‌లో చాలా ఫేమస్. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొంటున్న ఇమ్రాన్ తాహీర్, బుధవారం జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయగానే జెర్సీ విప్పి, సెలబ్రేట్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ఆడుతున్న ఇమ్రాన్ తాహీర్, క్వెటా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయగానే జెర్సీ విప్పి,సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇమ్రాన్ తాహీర్ టీ షర్టుపైన పాక్ క్రికెటర్, ఇమ్రాన్ తాహీర్ అన్న ముగల్ తాహీర్ ఫోటో ఉంది.

జనవరి 10న అనారోగ్యంతో మరణించిన తాహిర్ ముగల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 503 వికెట్లు తీశాడు. లాహోర్ కోచ్‌గా ఉన్న ముగల్, ఇమ్రాన్ తాహీర్‌కి అన్న. వికెట్ తీసిన తర్వాత ‘మిస్ యూ మై బ్రదర్’ అంటూ సోదరుడు ఫోటో ఉన్న టీ షర్టుని చూపించాడు.

 

విషయం తెలిసిన సహచరులు, అతన్ని అభినందించారు. లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్ తాహీర్, బతుకు తెరువు కోసం సౌతాఫ్రికా వెళ్లాడు. కరోనా కారణంగా పీఎస్‌ఎల్ 2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే.