ఇటీవల ముగిసిన ఐపిఎల్ సీజన్ 12లో ఓ యువకుడు రాజస్థాన్ జట్టు తరపున అద్భుతంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లు కూడా ఇంత చిన్న వయసులో అతడి పరిణతితో కూడిన బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను మెచ్చుకోకుండా వుండలేకపోయారు. ఇలా కేవలం 17ఏళ్ల ప్రాయంలోనే ఐపిఎల్ లో అడుగుపెట్టిన రియాన్ పరాగ్ కేవలం తన ఆటతోనే కాదు మాటలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 

''ఈశాన్య రాష్ట్రాల నుండి క్రికెట్లోకి చాలా తక్కువ మంది వస్తుంటారు. అలాంటి అతి తక్కువమంది ఆటగాళ్లలో మా నాన్న పరాగ దాస్ ఒకరు. ఆయన కలను  నెరవేర్చడానికే క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నా. ప్రస్తుతం నేను అతి తక్కువ వయసులో క్రికెటర్ గా  రాణిస్తున్నానంటే  అది మా నాన్న చలవే. బాల్యం నుంచి ఆయన ఆటను చూస్తూ పెరిగినానని'' రియాన్ తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. 

'' మా నాన్న తర్వాత నేను  మహిళా క్రికెటర్ స్మృతి మంధానను అత్యంత ఇష్టపడతాను.  కళ్ళద్దాలు పెట్టుకుని ఆమె క్రీజులో నిలబడితే చాలుు చూసు తిప్పుకోబుద్ది కాదు. ఇక ఆమె బ్యాటింగ్ స్టైల్ అద్భుతం. ఆ స్టైల్ ను నేనే ఎన్నో మ్యాచుల్లో పాలో అవుతూ వుంటా. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె ఫుట్ వర్క్ చాలా బావుంటుంది. ఇక పురుషుల క్రికెట్ విషయాని వస్తే సచిన్, విరాట్ కోహ్లీ ల బ్యాటింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం'' అని  పరాగ్ మందానపై తనకున్న అభిమానాన్ని  వ్యక్తపర్చాడు.