Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ జెర్సీ తీసుకున్న బాబర్ అజామ్.. వసీం అక్రమ్ సీరియస్..!

 ఈ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ చేసిన పని కి పాక్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోయామనే బాధ లేకుండా, వెళ్లి విరాట్ కోహ్లీ జెర్సీలను  బాబర్ అజామ్ అడిగి తెచ్చుకున్నాడు.

If Your Uncle's Son Wanted Virat Kohli's Shirt...": Wasim Akram Rips Into Babar Azam ram
Author
First Published Oct 16, 2023, 11:13 AM IST

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది.  శనివారం  పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయ్యింది. భారత్ చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోయింది. హోరా హోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ ని టీమిండియా ఆటగాళ్లు అలవోగా గెలిచేశారు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ చేసిన పని కి పాక్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మ్యాచ్ ఓడిపోయామనే బాధ లేకుండా, వెళ్లి విరాట్ కోహ్లీ జెర్సీలను  బాబర్ అజామ్ అడిగి తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా వసీమ్ అక్రమ్ ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. తన అసహనాన్ని బయటకు తెలియజేశాడు. జెర్సీలు తీసుకోవడానికి అదే సమయమా అంటూ ప్రశ్నించాడు. ‘ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నుంచి బాబర్ అందరి ముందు అలా జెర్సీలు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, అలా  తీసుకోవడానికి అది సరైన సమయం కాదు. అంతగా తీసుకోవాలంటే, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి తీసుకోవచ్చు కదా. తన అంకుల్ కొడుకు అడిగాడు అని, అందరి ముందు జెర్సీలు తీసుకోవాలా’ అంటూ వసీమ్ అక్రమ్ మండిపడ్డాడు.


ఇదిలా ఉండగా, ఆట తర్వాత, బాబర్ తన జట్టు మ్యాచ్‌లో ఒప్పించలేకపోయిందని అంగీకరించాడు. పాకిస్థాన్ లక్ష్యం 280-290 పరుగులు కాగా, 191 పరుగులకే చేరుకోగలిగింది.

"మేము బాగా ప్రారంభించాము. నాకు , ఇమామ్‌కు మధ్య మంచి భాగస్వామ్యం ఉంది. మేము సాధారణ క్రికెట్ (నేను, రిజ్వాన్) ఆడాలని అనుకున్నాము. అకస్మాత్తుగా మేము కుప్పకూలాము. సరిగ్గా ముగించలేదు. మేము ప్రారంభించిన మార్గం 280-290 లక్ష్యంగా పెట్టుకోవాలనుకున్నాము. కొత్త బాల్‌ మేం స్కోరుకు చేరుకోలేదు. రోహిత్‌ ఆడుతున్న తీరు - అతను అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు" అని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు.  ఏది ఏమైనా మరోసారి వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ గెలవడం అసాధ్యం అని  టీమిండియా మరోసారి  ప్రూవ్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios