Asianet News TeluguAsianet News Telugu

ఆ మ్యాచ్ జరిగి ఉంటే, మేమే గోల్డ్ గెలిచేవాళ్లం! ఏషియా గేమ్స్‌పై ఆఫ్ఘాన్ పేసర్ ఫరీద్ మాలిక్...

వర్షంతో ఫలితం తేలకుండానే రద్దు అయిన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్...  మెరుగైన ర్యాంకు కారణంగా గోల్డ్ గెలిచిన టీమిండియా.. 

if match abounded gold medal should have been shared, Afghanistan paced Fareed Malik CRA
Author
First Published Oct 12, 2023, 4:28 PM IST | Last Updated Oct 12, 2023, 4:28 PM IST

మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్‌కి వెళ్లిన భారత క్రికెట్ జట్లు, స్వర్ణ పతకాలను సాధించాయి. మహిళల టీ20 క్రికెట్ ఫైనల్‌లో టీమిండియా, శ్రీలంకపై 19 పరుగుల తేడాతో నెగ్గి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అయితే పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే షాహీదుల్లా కమల్, గుల్బాద్దీన్ నయీబ్ కలిసి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు.. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది ఆఫ్ఘాన్..

క్వార్టర్ ఫైనల్‌లో శ్రీలంకను, సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కింద ఉన్న కారణంగా రజతంతో సరిపెట్టుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో నేపాల్‌ని, సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించిన భారత జట్టు.. మెరుగైన ర్యాంకు కారణంగా స్వర్ణం గెలిచింది..

‘ఫైనల్ రద్దు అయితే స్వర్ణం పతకాన్ని సగం సగం ఇవ్వాల్సింది. మ్యాచ్ జరగకపోతే అదే కదా చేయాల్సింది. ర్యాంకింగ్స్ ఆధారంగా స్వర్ణ పతక విజేతను నిర్ణయించడం కరెక్ట్ కాదు. మ్యాచ్ జరిగి ఉంటే మజా వచ్చి ఉండేది. పాకిస్తాన్‌ని, శ్రీలంకను ఓడించాం.. మ్యాచ్ జరిగి ఉంటే గెలిచి ఉండేవాళ్లం.. 

ఏషియన్ గేమ్స్‌లో ఆడడం చాలా చక్కగా అనిపించింది. అయితే స్టేడియంలో చాలా మంది క్రికెట్ నాలెడ్జ్ లేనివాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రతీదానికి ఎంజాయ్ చేస్తున్నారు. సిక్సర్ కొట్టినా చప్పట్లు కొడుతున్నారు, అవుటైనా కూడా... ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాలేదు..’ అంటూ కామెంట్ చేశాడు ఆఫ్ఘనిస్తాన్ పేసర్ ఫరీద్ మాలిక్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios