Asianet News TeluguAsianet News Telugu

ఆ క్రికెటర్లను ఇంగ్లాండ్ కు పంపేదే లేదు.. బీసీసీఐ క్లారిటీ

బయో బబుల్ లో ఉంచినప్పటికీ.. వారికి కరోనా సోకడంతో ఏకంగా సీజన్ ని రద్దు చేశారు. ఈఐపీఎల్ రద్దు కావడంతో.. త్వరలో ఇంగ్లాండ్ సీరస్ కి క్రికెటర్లు సన్నద్ధమౌతున్నారు. 

if Covid 19 test is positive, consider England tour: BCCI Guidelines for Team India
Author
Hyderabad, First Published May 11, 2021, 2:07 PM IST

కరోనా ప్రభావం ఐపీఎల్ పై కూడా పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. బయో బబుల్ లో ఉంచినప్పటికీ.. వారికి కరోనా సోకడంతో ఏకంగా సీజన్ ని రద్దు చేశారు. ఈఐపీఎల్ రద్దు కావడంతో.. త్వరలో ఇంగ్లాండ్ సీరస్ కి క్రికెటర్లు సన్నద్ధమౌతున్నారు. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది.బ్రిటన్ విమానం ఎక్కే ముందు చేసే కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లీ సేన జూన్‌ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడాల్సి ఉంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది.

ప్రస్తుతం ఇళ్లలోనే ఉన్న ఆటగాళ్లంతా ముంబై వచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ సమయంలో రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎవరికి పాజిటివ్ వచ్చినా భారత్‌లోనే ఉండిపోవాలని, సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసిందట. అందుకే ముంబై వచ్చే ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని ఆటగాళ్లకు ఫిజియో యోగేశ్ పామర్ చెప్పారట. ఇది సుదీర్ఘ సిరీస్ కావడంతో ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇంగ్లండ్ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్ల పైనే ఉంటుందని బోర్డు స్పష్టం చేసిందట. 

Follow Us:
Download App:
  • android
  • ios