ఇండియాని ఓడిస్తే, బంగ్లాదేశ్ కుర్రాడితో డిన్నర్ డేట్‌కి వెళ్తా! పాకిస్తాన్ హీరోయిన్ ఆఫర్...
బంగ్లాదేశ్ జట్టు, భారత్‌ని ఓడించగలిగితే నేను ఢాకాకి వెళ్తా. అక్కడ బెంగాలీ బాయ్‌తో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తా... పాకిస్తాన్ నటి సెహెర్ షిన్వారి ట్వీట్ వైరల్....
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కోసం కొన్ని నెలల పాటు ఎదురుచూశారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌కి వచ్చిన హైప్ కారణంగా అహ్మదాబాద్‌లో హోటళ్లు, హాస్పటిల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అయితే అక్టోబర్ 14న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో పూర్తిగా భారత జట్టు డామినేషనే కనిపించింది..
అటు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇరగదీసిన భారత జట్టు, 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. బాబర్ ఆజమ్ 50, మహ్మద్ రిజ్వాన్ 49 పరుగులు చేసినా మిగిలిన బ్యాటర్లు అందరూ అట్టర్ ఫ్లాప్ కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగులు చేసి అదరగొట్టగా శ్రేయాస్ అయ్యర్ అజేయ హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ని ముగించాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై వరుసగా 8 విజయాన్ని అందుకున్న భారత్, ఆధిపత్యాన్ని కాపాడుకుంది.
‘మా బెంగాలీ బంధువులు, తర్వాతి మ్యాచ్‌లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటారు. బంగ్లాదేశ్ జట్టు, భారత్‌ని ఓడించగలిగితే నేను ఢాకాకి వెళ్తా. అక్కడ బెంగాలీ బాయ్‌తో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తా... ’ అంటూ పోస్ట్ చేసింది పాకిస్తాన్ నటి సెహెర్ షిన్వారి...
వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టుకి బంగ్లాదేశ్‌పై మంచి రికార్డు ఉంది. అయితే 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో మొట్టమొదటిసారిగా బంగ్లాతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు. గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్ ఓటమి, టీమిండియాలో పెను మార్పులు రావడానికి కారణమైంది..
ఈ పరాభవం తర్వాత భారత క్రికెటర్ల ఇళ్లపై అభిమానులు దాడులు కూడా చేశాయి. ఈ కారణంగానే సీనియర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ వంటి ప్లేయర్లు, 2007 టీ20 వరల్డ్ కప్‌కి దూరంగా ఉన్నారు..
ఆ పరాభవం తర్వాత 2011లో బంగ్లాదేశ్‌తో ఢాకాలో మ్యాచ్ ఆడిన భారత జట్టు 87 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 2015 వన్డే వరల్డ్ కప్‌పై బంగ్లాపై 109 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా, 2019 ప్రపంచ కప్‌లో 28 పరుగుల తేడాతో గెలిచింది..