Asianet News TeluguAsianet News Telugu

ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ! స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... ఆసీస్ భారీ స్కోరు, తేలిపోయిన భారత బౌలర్లు...

WTC Final:  106 బంతుల్లో సెంచరీ అందుకున్న ట్రావిస్ హెడ్.. స్టీవ్ స్మిత్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం... భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియా.. 

ICC WTC Final 2023: Travis Head Century, Steve Smith completes half century, Australia dominates CRA
Author
First Published Jun 7, 2023, 9:09 PM IST

ఐసీసీ ఈవెంట్‌ అనగానే భారత బౌలర్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతారు. 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో 10 వికెట్ల పరాజయాన్ని అందించిన భారత బౌలర్లు, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ చేతులు ఎత్తేశారు. మరోసారి టీమిండియాకి అలాంటి అనుభవమే ఎదురవుతోంది...

కెన్నింగ్టన్‌ ఓవల్ వేదికగా జరుగుతున్న  ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, 65 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత లబుషేన్ అవుట్ కావడంతో 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కలిసి నాలుగో వికెట్‌కి 150+ భాగస్వామ్యం జోడించి ఆదుకున్నారు...

ట్రావిస్ హెడ్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ అందుకోగా, స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. 

ట్రావిస్ హెడ్‌కి ఇది ఆరో టెస్టు సెంచరీ కాగా విదేశాల్లో మొట్టమొదటిది. టీమిండియాపై కూడా ట్రావిస్ హెడ్‌కి ఇదే మొదటి సెంచరీ. 65 ఓవర్లు ముగిసే సమయానికి ఈ ఇద్దరూ 249 బంతుల్లో 162 పరుగుల భాగస్వామ్యం జోడించారు.. 

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించాడు. 10 బంతులు ఆడిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో 4 ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

60 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్నస్ లబుషేన్ వికెట్ కోసం రెండు సార్లు డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే ఓసారి అంపైర్ కాల్స్‌గా రావడంతో బతికిపోయిన లబుషేన్, మరోసారి లక్కీగా బంతి వికెట్లను మిస్ కావడంతో లైఫ్ దక్కించుకున్నాడు...

లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. లంచ్ బ్రేక్ తర్వాత వస్తూనే లబుషేన్‌ని అవుట్ చేశాడు మహ్మద్ షమీ. 62 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్, వస్తూనే వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్న ట్రావిస్ హెడ్, మరో 46 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios