Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: విరాట్ కోహ్లీ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

ICC World cup 2023:  16 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, 16 పరుగులు చేసి పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్.. 79 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 

ICC World cup 2023:  Virat Kohli goes after scoring 16 runs, Team India lost 2 wickets CRA
Author
First Published Oct 14, 2023, 6:48 PM IST

అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లు కూడా ముగియకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. రీఎంట్రీ హీరో శుబ్‌మన్ గిల్ పెద్దగా మెరుపులు మెరిపించకుండానే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది భారత జట్టు..

తొలి బంతి ఫోర్ బాది, ఇన్నింగ్స్‌ని ఘనంగా మొదలెట్టాడు రోహిత్ శర్మ. శుబ్‌మన్ గిల్ కూడా తాను ఎదుర్కొన్న మొదటి బంతికి ఫోర్ బాదాడు. హసన్ ఆలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

11 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, బౌండరీ బాదేందుకు ప్రయత్నించి షాదబ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా... ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో 70+ పరుగులు చేసి ఉంటే.. నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచి ఉండేవాడు..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విరాట్ కోహ్లీ.. దాన్ని పెద్దగా వినియోగించుకోలేకపోయాడు..

18 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హసన్ ఆలీ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. మరో ఎండ్‌లో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, వన్డేల్లో 300 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు..

షాహిదీ ఆఫ్రిదీ 351, క్రిస్ గేల్ 331 వన్డే సిక్సర్లతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఓవరాల్‌గా 555+ అంతర్జాతీయ సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios