ICC World cup 2023: టాస్ గెలిచిన టీమిండియా... శుబ్‌మన్ గిల్ రీఎంట్రీ..

India vs Pakistan: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... ఇషాన్ కిషన్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్..

ICC World cup 2023:  Team India won the toss and elected to field first CRA

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో టీమిండియా, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది. టాస్ గెలిచిన టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు...

డెంగ్యూతో బాధపడుతూ మొదటి రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ ర్యాంకు కోసం బాబర్ ఆజమ్, శుబ్‌మన్ గిల్ మధ్య పోటీ జరగనుంది. నెం.2లో శుబ్‌మన్ గిల్‌కీ, నెం.1 లో ఉన్న బాబర్ ఆజమ్‌కి మధ్య కేవలం 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో రాణించిన ప్లేయర్, వచ్చే వారం నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలుస్తాడు..  

రోహిత్ శర్మ, గత మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌పై భారీ సెంచరీ బాదగా విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కెఎల్ రాహుల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. శుబ్‌మన్ గిల్ రీఎంట్రీతో ఇషాన్ కిషన్ నేటి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది..

జస్ప్రిత్ బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నా, మహ్మద్ సిరాజ్ గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించాడు. సిరాజ్ ప్లేస్‌లో మహ్మద్ షమీకి చోటు దక్కవచ్చని ప్రచారం జరిగినా అతన్ని కొనసాగించడానికే మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు 1 లక్షా 30 వేల మంది ప్రేక్షకుల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ ఇరుజట్లకీ కీలకం కానుంది...

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షెఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ ఆలీ, షాహీన్ ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios