వరల్డ్ కప్‌లో టీమిండియా ఫీల్డింగ్ మెరుగుపర్చేందుకు వినూత్న ఆలోచన... బాగా ఫీల్డింగ్ చేసినవారికి...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో టీమిండియా అద్భుత ఫీల్డింగ్.. బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే పేరుతో మెడల్ బహుకరణ...
ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచ కప్‌కి ముందు టీమిండియాని వెంటాడిన సమస్య ఫీల్డింగ్. బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండగా బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో, అంతకుముందు ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా పేలవ ఫీల్డింగ్‌తో క్యాచులు డ్రాప్ చేసింది..
అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత ఫీల్డింగ్ చాలా మెరుగైంది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లో 92 శాతం క్యాచ్‌లను అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, బంగ్లాదేశ్ 91, బంగ్లాదేశ్ 83 శాతం క్యాచ్ ఎఫిషియెన్సీతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి..
టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపర్చేందుకు టీమ్ మేనేజ‌్‌మెంట్ వినూత్న ఆలోచన చేసింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డింగ్ చేసిన ప్లేయర్‌కి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌తో సత్కరిస్తోంది టీమిండియా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే క్యాచులు అందుకున్న విరాట్ కోహ్లీ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ అందుకున్నాడు..
ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న శార్దూల్ ఠాకూర్, విరాట్ కోహ్లీ నుంచి బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎవరు బెస్ట్ ఫీల్డింగ్ చూపిస్తే, వారికి ఆ మెడల్ మారుతుంది..