టీమిండియా ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదుగా... ఇంగ్లాండ్ తోనూ ఆ ఆల్ రౌండర్ ఆడటం అనుమానమే..!

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తోనే కాదు ఆ తర్వాత జరిగే శ్రీలంక తో జరిగే మ్యాచ్ ఆడటమూ అనుమానంగానే కనిపిస్తోంది.  

ICC World Cup 2023 ...  Team India Allrounder Hardik Pandya injury Update AKP

హైదరాబాద్ : ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో సత్తాచాటుతున్న రోహిత్ సేన తర్వాతి మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన టోర్నీలో ఓటమన్నదే ఎరుగని ఏకైక జట్టు భారత్ మాత్రమే... ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా ఆడనున్న మరికొన్ని మ్యాచ్ లకు కీలక ఆల్ రౌండర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇలా టీమ్ మొత్తం సెట్ అయి దూకుడుమీద వున్న సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ అతడు ఆ తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ నెల 29న ఇంగ్లాండ్ తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడని... తిరిగి జట్టులో చేరతాడని ఆశించారు. కానీ అతడు ఇంకా కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్ తోనే కాదు  ఆ తర్వాత శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ కు కూడా దూరం కానునున్నట్లు తెలుస్తోంది. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ధర్మశాలకు వెళ్లారు. కానీ గాయపడ్డ హార్దిక్ మాత్రం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాండ్యాకు విశ్రాంతి సూచించారు. దీంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ లో పాండ్యా లేనిలోటు స్పష్టంగా కనిపించింది. 

Read More  icc odi world cup : వార్నర్ , మ్యాక్స్‌వెల్ ఊచకోత .. నెదర్లాండ్స్ విలవిల, ఏకంగా 309 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు

అయితే అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో మ్యాచ్ నాటికి పాండ్యా కోలుకుంటాడని... తిరిగి టీమిండియా తరపున బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అతడు మరికొంత కాలం జట్టుకు దూరంగానే వుండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకుంటున్న పాండ్యాకు నేడు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీని ఆధారంగానే అతడు తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో తేలనుంది. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత పాండ్యా ప్రాక్టీస్ కు పూర్తిగా దూరమయ్యాడు. అలాగే ఇప్పటికే వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది భారత జట్టు. దీంతో పాండ్యాకు మరికొన్నిరోజులు విశ్రాంతి ఇచ్చినా  పెద్దగా నష్టమేమీ వుండదని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో పూర్తిగా పిట్ నెస్ సాధించిన పాండ్యాను బరిలోకి దింపాలని భావిస్తున్నారట. ఇందుకోసమే తర్వాతి రెండు మ్యాచ్ లు అంటే ఇంగ్లాండ్, శ్రీలంక లతో జరిగే మ్యాచుల్లో కూడా హార్దిక్ పాండ్యాను ఆడించకపోవచ్చని తెలుస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios