ICC World cup 2023: టాస్ గెలిచిన శ్రీలంక... గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్! లంకకి చావో రేవో..
India vs Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక... వరుసగా రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయబోతున్న భారత జట్టు..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు భారత జట్టు, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు కెప్టెన్ కుసాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
మొదట ఆరు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. మరో వైపు మొదటి 6 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది శ్రీలంక. నెదర్లాండ్స్‌పై గెలిచిన శ్రీలంక, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ని ఓడించింది..
గత మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిన శ్రీలంక సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా నేటి మ్యాచ్‌లో కూడా బరిలో దిగడం లేదు. గత రెండు మ్యాచుల్లో ఆడిన జట్టే, నేటి మ్యాచ్‌లో కూడా బరిలో దిగుతోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, దిముత్ కరుణరత్నే, కుసాల్ మెండిస్ (కెప్టెన్), సధీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషాన్ హేమంత, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, ధుస్మంత ఛమీర, దిల్షాన్ మధుశంక