Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీ బర్త్ డే కోసం ప్రత్యేక ఏర్పాట్లు... భారీ కేక్, లైట్ షో, 70 వేల కోహ్లీ మాస్కులు...

నవంబర్ 5న 35వ బర్త్ డే జరుపుకోబోతున్న విరాట్ కోహ్లీ.. అదే రోజు ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్.. 

ICC World cup 2023: Special arrangement for Virat Kohli Birthday in Eden Gardens, Kolkata CRA
Author
First Published Oct 31, 2023, 1:58 PM IST

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని చేర్చడానికి కూడా విరాట్ కోహ్లీ క్రేజ్, పాపులారిటీయే కారణమని ఒలింపిక్స్ కమిటీ సభ్యులే కామెంట్లు చేశారు. నవంబర్ 5న 35వ ఒడిలో అడుగుపెట్టబోతున్నాడు విరాట్ కోహ్లీ..

అదే రోజున కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. దీంతో విరాట్ కోహ్లీ బర్త్ డే కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB). విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా 35 కిలోల ప్రత్యేక కేక్‌ని ఆర్డర్ చేసింది బెంగాల్ క్రికెట్ అసోసియేషన్..

‘విరాట్ కోహ్లీ వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ ఐకాన్. అతని బర్త్ డే సెలబ్రేట్ చేసే అవకాశం దక్కడం మా అదృష్టం. విరాట్ కోహ్లీ బర్త్ డే కోసం స్పెషల్ కేక్ ఆర్డర్ చేశాం. అలాగే మ్యాచ్ తర్వాత ఫైర్ వర్క్స్ ఉంటాయి. అలాగే లేజర్ షోతో బర్త్ డే విషెస్ తెలియచేస్తాం.. 

అంతేకాదు కోల్‌కత్తాలో మ్యాచ్ చూసేందుకు వచ్చేవారంతా విరాట్ కోహ్లీ పేస్ మాస్క్‌తో ఉంటారు. దాదాపు 70 వేల మంది విరాట్ కోహ్లీ ఫేస్ మాస్కులతో స్టేడియంలో ఉంటారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి బర్త్ డే సెలబ్రేషన్స్‌ ఇంతకుముందు జరగలేదు, ఇకపై జరగవనేది నిర్వహిస్తాం..’ అంటూ కామెంట్ చేశాడు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ స్నేహాశీష్ గంగూలీ.. 

Follow Us:
Download App:
  • android
  • ios