ICC World Cup 2023 Schedule: క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించింది.
ప్రపంచ క్రికెట్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. కొద్దిసేపటి క్రితమే ఐసీసీ.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా తలపడబోయే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వరకూ సాగే ఈ ప్రపంచకప్ సమరంలో భారత జట్టు.. వరల్డ్ కప్ వేటను అక్టోబర్ 8న మొదలుపెట్టనుంది. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా భారత్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ కప్ లో భారత్ ఫుల్ షెడ్యూల్, వేదికల వివరాలు ఇక్కడ చూద్దాం.
టీమిండియా వరల్డ్ కప - 2023 షెడ్యూల్ :
అక్టోబర్ 8, చెన్నై : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
అక్టోబర్ 11, ఢిల్లీ : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 15, అహ్మదాబాద్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్
అక్టోబర్ 19, పూణె : ఇండియా వర్సస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 22, ధర్మశాల : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 29, లక్నో : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
నవంబర్ 02, ముంబై : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 05, కోల్‌కతా : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 11, బెంగళూరు : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
ఈ టోర్నీలో భారత జట్టు మొత్తంగా లీగ్ దశలో 9 మ్యాచ్‌లను ఆడనుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కలిగిన భారత్ - పాక్ మ్యాచ్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగానే జరుగనుంది.
