ICC World cup 2023: బోణీ కొట్టిన పాకిస్తాన్... పోరాడి ఓడిన నెదర్లాండ్స్...
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్... 67 పరుగులు చేసిన బస్ దే లీడే, 52 పరుగులు చేసిన విక్రమ్‌జీత్ సింగ్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ బోణీ కొట్టింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. 287 పరుగుల లక్ష్యఛేదనలో 41 ఓవర్లు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది..
మ్యాక్స్ ఓడోడ్ 5, కోలీన్ అకీర్‌మన్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. అయితే విక్రమ్‌జీత్ సింగ్, బస్ డే లీడ్ కలిసి మూడో వికెట్‌కి 70 పరుగులు జోడించారు.
విక్రమ్‌జీత్ సింగ్ 67 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేయగా బస్ దే లీడే 68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తేజ నిడమనురు 5 పరుగులు చేయగా కెప్టెన్ ఎడ్వర్డ్స్ డకౌట్ అయ్యాడు.
సకీబ్ జుల్ఫీకర్ 10, వాన్ డే మెర్వే 4, ఆర్యదత్ 1 పరుగు చేసి అవుట్ కాగా లోగన్ వాన్ బీక్ బంతుల్లో ఫోర్లు, ఓ సిక్సర్‌తో పరుగులు, పాల్ వాన్ మీకెరన్ పరుగులు చేశాడు. హారీస్ రౌఫ్, హసన్ ఆలీ రెండేసి వికెట్లు తీశారు. షాహీన్ ఆఫ్రిదీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 49 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫకార్ జమాన్ 3 ఫోర్లతో 12 పరుగులు చేసి లోగన్ వాన్ బ్రీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
18 బంతులు ఆడి 5 పరుగులే చేసిన బాబర్ ఆజమ్, కోలిన్ అకెర్మాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్‌ని వాన్ మీకీరన్ అవుట్ చేయడంతో 9.1 ఓవర్లు ముగిసే సమయానికి 38 పరుగులు చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్..
అయితే సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి నాలుగో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసిన సౌద్ కీల్, ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
75 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని బస్ దే లీడే పెవిలియన్ చేర్చాడు. ఇఫ్తికర్ అహ్మద్ కూడా 9 పరుగులకే అవుట్ అయ్యాడు.
188 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. అయితే మరోసారి పాక్‌కి అవకాశం ఇచ్చారు నెదర్లాండ్ బౌలర్లు. షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కలిసి ఏడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
34 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన షాదబ్ ఖాన్‌ని బస్ దే లీడే అవుట్ చేయగా 43 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసిన నవాజ్ రనౌట్ అయ్యాడు. హసన్ ఆలీని గోల్డెన్ డకౌట్ చేశాడు బస్ దే లీడే..
అయితే ఆఖరి వికెట్‌కి హారీస్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ కలిసి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాహీన్ ఆఫ్రిదీ 2 ఫోర్లతో 13 పరుగులు, 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన హారీస్ రౌఫ్ స్టంపౌట్ అవ్వడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో బస్ దే లీడేకి 4 వికెట్లు దక్కగా కోలిన్ అకెర్మాన్ 2 వికెట్లు తీశాడు.