Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: లబుషేన్ హాఫ్ సెంచరీ, 4 వికెట్లు తీసిన క్రిస్ వోక్స్... పరువు కోసం ఇంగ్లాండ్..

England vs Australia: 286 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్... 4 వికెట్లు తీసిన క్రిస్ వోక్స్, 71 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. 

ICC World cup 2023: Marnus Labuschagne scores half century, Chris Woakes picks four CRA
Author
First Published Nov 4, 2023, 6:27 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్... పరువు కాపాడుకునేందుకు కష్టపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 49.3 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

ట్రావిస్ హెడ్ 11 పరుగులు, డేవిడ్ వార్నర్ 15 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

52 బంతుల్లో 3 ఫోర్లతో 44 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జోష్ ఇంగ్లీష్ 3 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కి 61 పరుగులు జోడించారు..

52 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్‌ని డేవిడ్ విల్లే క్లీన్ బౌల్డ్ చేశాడు. 83 బంతుల్లో 7 ఫోర్లతో 71 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని మార్క్ వుడ్ అవుట్ చేశాడు. మార్కస్ స్టోయినిస్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా ప్యాట్ కమ్మిన్స్ 10, మిచెల్ స్టార్క్ 10, ఆడమ్ జంపా 19 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేశారు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు తీయగా మార్క్ వుడ్, అదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీశారు. డేవిడ్ విల్లే, లియామ్ లివింగ్‌స్టోన్ తలా ఓ వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios