Asianet News TeluguAsianet News Telugu

ENG vs NZ: జో రూట్ హాఫ్ సెంచరీ, ఇంగ్లాండ్‌ని ఆలౌట్ చేయలేకపోయిన న్యూజిలాండ్..

50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. 77 పరుగులు చేసిన జో రూట్, 43 పరుగులు చేసిన కెప్టెన్ జోస్ బట్లర్.. 

ICC World cup 2023: England scores huge total against New Zealand, Joe Root, Jos Buttler CRA
Author
First Published Oct 5, 2023, 5:39 PM IST | Last Updated Oct 5, 2023, 5:42 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వీలుగా కేన్ విలియంసన్‌కి రెస్ట్ ఇచ్చింది న్యూజిలాండ్. నేటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టామ్ లాథమ్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేయగలిగింది..

24 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి దూకుడుగా ఇన్నింగ్స్ మొదలెట్టిన హారీ బ్రూక్‌ని రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు. మొయిన్ ఆలీ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా లియామ్ లివింగ్‌స్టోన్ 20, సామ్ కుర్రాన్ 14 పరుగులు చేశారు. జో రూట్ 86 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 77 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ ఎండ్‌లో కుదురుకుపోయిన జో రూట్ కూడా గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

క్రిస్ వోక్స్ 11 పరుగులు చేసి అవుట్ కాగా అదిల్ రషీద్, మార్క్ వుడ్ కలిసి 4.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఆఖరి వికెట్‌కి 30 పరుగులు జోడించారు. మార్క్ వుడ్ 14 బంతుల్లో 13 పరుగులు చేయగా ఓ సిక్సర్ బాదిన అదిల్ రషీద్ 15 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోరు చేయడం విశేషం. 

న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్ గాయాలతో నేటి మ్యాచ్‌కి దూరమయ్యారు. ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీయగా మ్యాట్ హెన్రీకి 3 వికెట్లు దక్కాయి. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు తీశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios