ICC Womens T20 World Cup: మహిళల టీ20  ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నేడు ఇంగ్లాండ్ తో తలపడుతున్నది.  

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ నేడు కీలక మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ కు రానుంది. లీగ్ దశలో తొలుత పాకిస్తాన్ తర్వాత వెస్టిండీస్ లను ఓడించిన భారత్.. నేటి మ్యాచ్ లో నెగ్గితే నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకుంటుంది.

గ్రూప్ - బీ లో ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ (ఇంగ్లాండ్), నెంబర్ టూ (ఇండియా) స్థానంలో ఉన్నాయి. భారత్ కంటే ఇంగ్లాండ్ కు మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడిస్తే భారత్.. తర్వాత మ్యాచ్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరొచ్చు. 

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ మార్పు జరిగింది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఆడిన దేవికా వైధ్య నేటి మ్యాచ్ లో ఆడటంలేదు. ఆమె స్థానంలో ఆల్ రౌండర్ శిఖా పాండే తుది జట్టులోకి వచ్చింది.

Scroll to load tweet…

తుది జట్లు: 

ఇండియా : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, శిఖా పాండే, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్ 

ఇంగ్లాండ్ : హెథర్ నైట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, వ్యాట్, అలీస్ క్యాప్సీ, నటాలీ సీవర్, అమీ జోన్స్, క్యాథరిన్ సీవర్, సోఫీ ఎక్లెస్టోన్, ఛార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్