INDW vs PAKW: భారత మహిళా క్రికెటర్లు బ్యాటింగ్ లో తడబడ్డారు. పాకిస్థాన్ తో జరుగుతున్న ప్రపంచకప్ మహిళల  50 ఓవర్ల మ్యాచులో  మంచి ఆరంభమే దక్కినా..  

మహిళల ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లో తడబడుతున్నది. బే ఓవల్ వేదికగా మౌంట్ మంగనుయ్ గ్రౌండ్ లో జరుగుతున్న నాలుగో గ్రూప్ మ్యాచులో భారత్ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించినా.. వన్ డౌన్ బ్యాటర్ దీప్త శర్మ నిలకడగా ఆడినా పాక్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కీలక వికెట్లు కోల్పోయింది. 

హై ఓల్జేజీ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా సారథి మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే భారత్ కు భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ.. పరుగులేమీ చేయకుండానే 3 ఓవర్లోనే డకౌట్ అయింది. 6 బంతులు ఆడిన షఫాలీ.. డయానా బేగ్ బౌలింగ్ లో బౌల్డ్ అయింది. 

షఫాలీ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (40) తో కలిసి స్మృతి మంధాన (52) భారత ఇన్నింగ్స్ ను నడిపించింది. ఈ ఇద్దరూ కలిసి పాక్ బౌలర్లను సమర్థ:గా ఎదుర్కున్నారు. 75 బంతులాడిన మంధాన.. తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉంది. మంధాన, షఫాలీలు కలిసి రెండో వికెట్ కు 92 పరుగులు జోడించారు. అయితే శతకం దిశగా సాగుతున్న ఈ భాగస్వామ్యాన్ని నష్ర సంధు విడదీసింది. దీప్తి శర్మను నష్రా బౌల్డ్ చేసింది. అప్పటికి భారత స్కోరు 96-2.

Scroll to load tweet…

దీప్తి ఔట్ అయ్యాక మరో 3 ఓవర్లకే భారత్ కు మరో షాక్ తగిలింది. తన వన్డే కెరీర్ లో 25వ హాఫ్ సెంచరీ సాధించిన మంధాన.. 24.1 ఓవర్లో అనమ్ అమిన్ వేసిన బంతిని ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (9), హర్మన్ప్రీత్ కౌర్ (5), వికెట్ కీపర్ రిచా ఘోష్ (5) లు వెంటవెంటనే నిష్క్రమించారు. దీంతో భారత్.. 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం స్నేహ్ రాణా (8 బ్యాటింగ్), పూజా వస్త్రాకార్ (18 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 

Scroll to load tweet…

కాగా.. మహిళల క్రికెట్ లో ఇప్పటివరకు పాకిస్థాన్ పై భారత్ ఓడిపోలేదు. భారత్-పాక్ లు ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ పది సార్లు భారత్ నే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీలలో దక్కినవే. టీ20 ఫార్మాట్ లో రెండు జట్లు 11 మ్యాచులలో తలపడగా.. పాకిస్థాన్ ఒక్కసారే గెలిచింది.