Asianet News TeluguAsianet News Telugu

ముందుంది మరో ప్రపంచకప్.. ఈనెల పది నుంచే ప్రారంభం.. షెడ్యూల్, జట్ల వివరాలు ఇవే..

ICC Women's T20 World Cup 2023: ఐసీసీ  ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే  మహిళల  టీ20 ప్రపంచకప్ కు వేళైంది. అండర్ - 19 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికానే..  ఈనెల 10 నుంచి సీనియర్ల వరల్డ్ కప్ నూ నిర్వహిస్తున్నది. 

ICC Women's T20 World Cup 2023  All set To Start  From Feb 10th, Here is The Schedule MSV
Author
First Published Feb 2, 2023, 1:35 PM IST

గడిచిన నాలుగైదు నెలలుగా క్రీడాభిమానులను  ప్రతీ నెలా ఏదో ఒక భారీ ఈవెంట్  అలరిస్తూనే ఉంది.  గతేడాది  అక్టోబర్ లో  ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగగా.. డిసెంబర్ లో ఫిఫా ప్రపంచకప్  ఘనంగా ముగిసింది. ఇక ఈ ఏడాది జనవరిలో  పురుషుల హాకీ ప్రపంచకప్ భారత్ లోనే జరిగింది.  దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ తొలిసారి అండర్ - 19 అమ్మాయిల  వరల్డ్ కప్ ను నిర్వహించింది.  ఈ  మెగా ఈవెంట్ లో  షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు టైటిల్ నెగ్గింది.  తాజాగా  ఈ నెలలో మరో ప్రపంచకప్  ముందుకు రాబోతున్నది.   

ఐసీసీ  ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే  మహిళల  టీ20 ప్రపంచకప్ కు వేళైంది. అండర్ - 19 ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికానే..  ఈనెల 10 నుంచి సీనియర్ల వరల్డ్ కప్ నూ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన టోర్నీలు, విజేతలు..  త్వరలో జరుగబోయే టోర్నీ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ఎనిమిదో ఎడిషన్ : 

- పురుషుల  టీ20 ప్రపంచకప్ ను  2007లో ప్రారంభించిన ఐసీసీ.. రెండేండ్ల తర్వాత (2009లో) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ను  తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఏడు ఎడిషన్లు ముగిశాయి.  ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగబోయేది 8వ ఎడిషన్. 
- ఏడుసార్లు  విజయవంతంగా ముగిసిన  ఈ టోర్నీలో ఆస్ట్రేలియా  మహిళల జట్టు  మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. కంగారూలు ఇప్పటివరకు ఏకంగా ఐదు  సార్లు టైటిల్ నెగ్గారు. 
- తొలి ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ గెలుచుకోగా తర్వాత  2010, 2012, 2014లో ఆసీస్ నెగ్గింది.  2016లో  వెస్టిండీస్ విశ్వవిజేతగా అవతరించింది. కానీ తర్వాత  2018, 2020లో  మళ్లీ ఆసీస్ జట్టే విజేతగా నిలిచింది. వాస్తవానికి 2022లో   ఎనిమిదో ఎడిషన్ జరగాల్సి ఉన్నా  ఫిఫా వరల్డ్ కప్ వల్ల  దీనిని 2023 ఫిబ్రవరికి వాయిదా వేశారు.

ఎన్ని జట్లు..? 

- ఈసారి పది జట్లు  ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆతిథ్య దేశంగా  సౌతాఫ్రికా  క్వాలిఫై అవగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తొలి ఏడు స్థానాల్లో ఉన్న  టీమ్స్ కూడా  క్వాలిఫై అయ్యాయి.    మరో రెండు టీమ్స్ కోసం క్వాలిఫికేషన్ టోర్నీలు జరిపారు.  ఇందులో బంగ్లాదేశ్, ఐర్లాండ్ లు గెలిచి ప్రపంచకప్ ఆడనున్నాయి.  

టీమ్స్ వివరాలు : 

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్  

వేదికలు : 

- మూడు వేదికల్లో  ఈ టోర్నీ జరుగనుంది. కేప్‌టౌన్, పార్ల్, జెబెర్త 

షెడ్యూల్ : 

- ఫిబ్రవరి 10 నుంచి  టోర్నీ ప్రారంభం 
- పది టీమ్ లను రెండు గ్రూప్ లుగా విడదీశారు.  గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంకలు ఉన్నాయి. 
- గ్రూప్ - బీలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ లు ఉన్నాయి. 
- గ్రూప్, నాకౌట్, సెమీస్, ఫైనల్స్ దశల్లో పోటీలు ఉంటాయి.   
- ఈనెల 10 నుంచి 21 వరకు  గ్రూప్ స్టేజ్ లలో మ్యాచ్ లు జరుగుతాయి.  ఆ తర్వాత  నాకౌట్ స్టేజ్ మొదలవుతుంది. 
- 23న, 24న సెమీస్ ఉంటుంది. 
- ఫిబ్రవరి 26న  కేప్‌టౌన్ వేదికగా తుది పోరు జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios