Asianet News TeluguAsianet News Telugu

ICC U-19 WC: సూపర్ మ్యాన్ లా ముందుకు దూకుతూ.. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న విండీస్ ఫీల్డర్

ICC Under-19 World Cup 2022: స్వతహాగా అథ్లెటిక్ లకు ఉండే దేహాన్ని కలిగి ఉండే  కరేబియన్ వీరులు..  గతంలో ఐపీఎల్ తో పాటు  పలు మ్యాచులలో కళ్లు చెదిరే క్యాచులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా...

ICC Under-19 World Cup 2022: West Indies Teddy Bishop Takes Supe Man Catch, Twitter Reacts
Author
Hyderabad, First Published Jan 19, 2022, 11:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా  టీ20 క్రికెట్ లీగ్ లు ఎక్కడ జరిగినా తప్పకుండా  కనిపించే ఆటగాళ్లలో  వెస్టిండీస్ ప్లేయర్లు ముందువరుసలో ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనే గాక మైదానంలో పాదరసంలా ముందుకు కదులుతూ అబ్బురపరిచే క్యాచులు అందుకోవడంలో వాళ్లు దిట్ట. స్వతహాగా అథ్లెటిక్ లకు ఉండే దేహాన్ని కలిగి ఉండే  కరేబియన్ వీరులు..  గతంలో ఐపీఎల్ తో పాటు  పలు మ్యాచులలో కళ్లు చెదిరే క్యాచులు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విండీస్  యువకెరటం  టెడ్డీ బిషప్ చేరాడు. తాజాగా అండర్-19 ప్రపంచపకప్ లో అతడు  సూపర్ మ్యాన్ క్యాచులతో అదరగొడుతున్నాడు. 

కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం ఆతిథ్య వెస్టిండీస్.. స్కాట్లాండ్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో బిషప్..  అబ్బురపరిచే క్యాచులు అందుకున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఇన్నింగ్స్ 26వ ఓవర్లో అమోరీ బౌలింగ్ లో బిషప్ ఈ క్యాచ్ అందుకున్నాడు. అమోరీ వేసిన బంతిని స్కాట్లాండ్ బ్యాటర్ రాబర్ట్సన్  స్లిప్స్ దిశగా ఆడాడు. అది బిషప్ ఉన్న చోటుకంటే దూరంగా వెళ్తున్నా..  పక్షిలా ముందుకు దూకుతూ  అద్భుమతైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా  మారింది. 

 దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘సూపర్ మ్యాన్ క్యాచ్...’, ‘స్పైడర్ మ్యాన్ దొరికాడు..’,  ‘జాంటీ రోడ్స్..’ ‘జూనియర్ జాంటీ రోడ్స్..’ అంటూ కామెంట్స్ చేశారు.  కాగా ఈ మ్యాచులో బిషప్ అందుకున్న మరో క్యాచ్ కూడా సెన్సేషనే. ఈ రెండు క్యాచులకు సంబంధించిన వీడియోలను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది. 
 

కాగా.. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. విండీస్ బౌలర్ల ధాటికి 35.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. డేవిడ్సన్ (43) టాప్ స్కోరర్. వెస్టిండీస్  బౌలర్ శివ శంకర్ 7 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి  3 వికెట్లు తీశాడు. అమోరీ, మహసె తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని విండీస్.. 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టెడ్డీ బిషప్ (23), పారిస్ (26) రాణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios