Asianet News TeluguAsianet News Telugu

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: సత్తా చాటిన జడేజా, పుజారా

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో 428 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

ICC Test Rankings Steve Smith surpasses Virat Kohli ksp
Author
Dubai - United Arab Emirates, First Published Jan 12, 2021, 8:03 PM IST

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో 428 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఇక పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దుమ్మురేపిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమిస్‌ తన పాయింట్లు మెరుగుపరచుకుని టాప్‌ 5లో చోటు సంపాదించాడు. 

ఇక బ్యాటింగ్‌ విభాగంలో కివీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ 900 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

Also Read:వికెట్లను నమస్కరిస్తూ క్రికెటర్ శ్రీశాంత్ రీఎంట్రీ... తొలి మ్యాచ్‌లో వికెట్ తీసి

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుతంగా ఆడిన చతేశ్వర్‌ పుజారా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానే ఒక స్థానం దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు.

బౌలింగ్‌ విషయానికి వస్తే ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత బౌలర్లు అశ్విన్‌, బుమ్రాలు 9, 10వ స్థానాల్లో నిలిచారు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో బొటనవేలి గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు దిగలేదు.

అతని బొటనవేలికి శస్త్ర చికిత్స పూర్తయినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా జడేజా ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టుతో పాటు ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios