దుబాయ్: టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. టీ20 ర్యాంక్ లను ఐసీసీ సోమవారంనాడు విడుదల చేసింది. 

న్యూజిలాండ్ పై జరిగిన టీ20 సిరీస్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్ ను ప్రదర్శించాడు. ఈ సిరీస్ ను ఇండియా 5-0 స్కోరుతో గెలుచుకుంది. రాహుల్ 56 సగటుతో 224 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పై జరిగిన టీ20 సిరీస్ లో నాలుగు మ్యాచులు ఆడిన కోహ్లీ 105 పరుగులు చేశాడు. 

ఐసీసీ ర్యాంకింగ్స్ భారత్ కెప్టెన్ కోహ్లీ స్థానాన్ని ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఆక్రమించాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన మూడు మ్యాచుల సిరీస్ లో అతను 136 పరుగులు చేసి సిరీస్ ను 2-1 స్కోరుతో గెలుచుకోవడం కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ 9వ స్థానంలో నిలిచాడు. 

Also Read: కోహ్లీలో నాకు నచ్చింది అదే: సచిన్ తో విభేదించిన స్టీవ్ వా

బాబార్ ఆజమ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాలను రాహుల్, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆక్రమించారు. బౌలింగ్, ఆల్ రౌండర్స్ జాబితాలో అఫ్గనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ అగ్రస్థానాల్లో నిలించారు. 

జట్ల విషయానికి వస్తే అగ్రస్థానంలో నిలువగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండు మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.

Also Read: టీ20 ప్రపంచకప్... భారత్, పాక్ మ్యాచ్ రద్దు.. నిరాశలో అభిమానులు