Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: మళ్లీ కెప్టెన్ గా ధోని..? ఓపెనర్ గా రోహిత్ శర్మ.. ఏ ఫ్రాంచైజీకో తెలుసా..?

MS Dhoni: ధోని మళ్లీ కెప్టెన్ అయ్యాడు. అదేంటి.. యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడుతున్న విరాట్ సేనకు ధోని మెంటార్ గా ఉన్నాడు కదా.. మళ్లీ కెప్టెన్ ఎలా అవుతాడు. ఇప్పటికే రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు కదా..? అనే కదా మీ అనుమానం. కరక్టే.. కానీ..

ICC T20 Worldcup2021: west indies opener evin lewis picks his all time T20I playing XI, former Indian skipper MS Dhoni To Lead the Team
Author
Hyderabad, First Published Oct 29, 2021, 2:38 PM IST

భారత క్రికెట్ (Indian Cricket) లో అతడొక సంచలనం. ముప్పై ఏండ్లుగా కండ్లు కాయలు కాచేలా వేచి చూసిన భారత క్రికెట్ అభిమానుల కోరిక తీర్చిన ఘనుడు. భారత్ ను వన్డేలు, టీ20లే కాదు.. టెస్టు క్రికెట్ లోనూ వరల్డ్ నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన యోధుడు. గత ప్రపంచకప్ లో సెమీస్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైనతర్వాత భారత్ తరఫున మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే రిటైరైన MS ధోని (MS Dhoni).. ఇప్పుడు మళ్లీ కెప్టెన్ గా అవతారమెత్తాడు.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ధోనినే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. త్వరలో జరిగే  ఐపీఎల్ (IPL) మెగా వేలంలో కూడా ధోనిని నిలుపుకుంటామని చెన్నై యాజమాన్యం (CSK) ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ధోనిని దక్కించుకోవడానికి  ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన జట్లతో పాటు పాత జట్ల యజమానులు కూడా చూస్తున్నారు. కానీ ధోని మాత్రం దీని మీద ఇంతవరకు స్పందించలేదు. 

అయితే ఇప్పుడు ధోని మళ్లీ కెప్టెన్ అయ్యాడు. అదేంటి.. యూఏఈలో టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) ఆడుతున్న విరాట్ (Virat Kohli) సేనకు ధోని మెంటార్ (Mentor Dhoni) గా ఉన్నాడు కదా.. మళ్లీ కెప్టెన్ ఎలా అవుతాడు. ఇప్పటికే రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాడు కదా..? అనే కదా మీ అనుమానం. కరక్టే.. కానీ ధోని కెప్టెన్ అయ్యేది ఏ జట్టుకూ కాదు. వెస్టిండీస్ (West Indies) క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) ఓపెనర్ ఎవిన్ లూయిస్ (Evin Lewis) తన ఆల్ టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ కు...

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. లూయిస్.. తాను ప్రకటించిన జట్టులో టీమిండియా  మాజీ సారథి  ఎంఎస్ ధోనిని సారథిగా ఎంచుకున్నాడు. ఈ జట్టులో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. 

 

లూయిస్ ఎలెవన్ టీంలో భారత సారథి విరాట్ కోహ్లికి మూడో స్థానం దక్కింది. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ కు వస్తే ఆ మజానే వేరట. ఐదో స్థానాన్ని  వెస్టిండీస్ టీ20 జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ కు ఇచ్చేశాడు లూయిస్. మహేంద్ర సింగ్ ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్ రావాలన్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ ఏడో స్థానం.. 8వ  స్థానంలో రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు. ఇక అఫ్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు తొమ్మిదో ప్లేస్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పదో స్థానమిచ్చాడు. ఆసీస్  స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను పదకొండో ప్లేయర్ గా ఎంచుకున్నాడు. 

అయితే తన జట్టులో ధోని వికెట్ కీపర్ బాధ్యతలతో పాటు సారథిగా ఉండాలని లూయిస్ చెప్పాడు.  ఇదిలాఉండగా.. టీ20 టోర్నీలో సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే వెస్టిండీస్ నేడు బంగ్లాదేశ్ తో  కీలకపోరులో తలపడనున్నది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలుంటాయి. ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.

ఎవిన్ లూయిస్ ఆల్ టైమ్ టీ20 లెవెన్: క్రిస్ గేల్, రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, బుమ్రా, మిచెల్ స్టార్క్

Follow Us:
Download App:
  • android
  • ios