Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఓపెనర్లు శుభారంభం.. ఆఖర్లో కరువైన మెరుపులు.. నమీబియా ఎదుట పోరాడే లక్ష్యం నిలిపిన అఫ్ఘాన్

Afghanistan vs Namibia: సెమీస్ అవకాశాలను నిలుపుకునేందుకు కసరత్తులు చేస్తున్న అఫ్ఘాన్.. ఆ దిశగా నమీబియాను ఓడించి రేసులో నిలవాలని భావిస్తున్నది.  ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఆ జట్టు సారథి మహ్మద్ నబీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ICC T20 Worldcup2021: Afghanistan set to 161 target for Namibia in group 1 match
Author
Hyderabad, First Published Oct 31, 2021, 5:23 PM IST

టీ20 ప్రపంచకప్ గ్రూప్-2లో భాగంగా అబుదాబిలో అఫ్ఘానిస్థాన్ తో నమీబియా జట్టు  తలపడుతున్నది. సెమీస్ అవకాశాలను నిలుపుకునేందుకు కసరత్తులు చేస్తున్న అఫ్ఘాన్.. ఆ దిశగా నమీబియాను ఓడించి రేసులో నిలవాలని భావిస్తున్నది.  ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఆ జట్టు సారథి మహ్మద్ నబీ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ అఫ్ఘాన్ మాజీ  కెప్టెన్ అజ్గర్ అఫ్ఘాన్ కు ఇదే చివరి మ్యాచ్. నేటి పోరులో అతడు రాణించాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అష్ఘాన్ కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లిద్దరూ  దూకుడుగా ఆడారు.  జజాయ్ (25 బంతుల్లో 32.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ షెహజాద్ (33 బంతుల్లో 45.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. వీరిరువురూ ధాటిగా ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొలి ఆరు ఓవర్ల లోపే ఆ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. 

ఇన్నింగ్స్ రెండో బంతినే జజాయ్ బౌండరీకి పంపిస్తే.. ఐదో బంతిని సిక్సర్ గా మలిచాడు. ట్రంపుల్మెన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఫ్రైలింక్ ను కూడా వదల్లేదు. అతడు వేసిన ఐదో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. మరోవైపు  షెహజాద్ కూడా తక్కువ తినలేదు. ఐదో ఓవరర్లో అతడు.. వీస్ బౌలింగ్ లో బౌండరీ, సిక్సర్ కొట్టాడు. 

 

ధాటిగా ఆడుతున్న ఓపెనర్ జజాయ్ ను జెజె స్మిట్ బోల్తా కొట్టించాడు. 6.4 ఓవర్లో మైఖేల్ వాన్ లింగెన్ కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. ఆ  తర్వాత స్కోరుబోర్డు కాస్త నెమ్మదించింది. వన్ డౌన్ లో వచ్చిన  గుర్బాజ్ (4)  ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అఫ్ఘాన్ మాజీ కెప్టెన్ అజ్గర్ (23 బంతుల్లో 31.. 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగానే ఆడాడు.  అప్పటిదాకా బాగానే ఆడుతున్న షెహజాద్ ను ట్రంపుల్మెన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే నజీబుల్లా (7) కూడా ఔటయ్యాడు. కానీ ఆరో నెంబర్ బ్యాటర్ గా వచ్చిన కెప్టెన్ మహ్మద్ నబీ (17 బంతుల్లో 32.. 5 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడాడు. ఫలితంగా అఫ్ఘాన్.. నమీబియా ముందు పోరాడే లక్ష్యాన్ని నిలిపింది. 

 

ఇక నమీబియా బౌలర్లలో గత మ్యాచ్ లో రాణించిన ట్రంపుల్మెన్.. నేటి మ్యాచ్ లోనూ రెండు వికెట్లు తీశాడు. స్మిట్.. పొదుపుగా బంతులువేసి..  ఒక వికెట్ పడగొట్టాడు. జాన్ నికోల్ కు రెండు వికెట్లు దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios