NZ vs SCO: న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్.. వికెట్ల వెనుక అన్న మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా అబుదాబిలో న్యూజిలాండ్-స్కాట్లాండ్ (Newzealand vs Scotland) తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్కాట్లాండ్.. కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (Newzealand).. స్కాట్లాండ్ (scotland) ఎదుట 173 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా.. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ (Matthew Cross) వికెట్ల వెనుక అన్న మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

న్యూజిలాండ్ తరఫున ఫిలిప్స్.. గప్తిల్ (Martin Guptill) క్రీజులో ఉన్నారు. బంతిని అందుకున్న క్రిస్ గ్రీవ్స్ (Chris Greaves).. బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ క్రాస్.. ‘కమాన్ గ్రీవో.. ఇండియా (India) మొత్తం నీ వెనకాలే ఉంది. కమాన్..’ అంటూ సందర్భోచితంగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

వరల్డ్ కప్ లో భారత్ ఇప్పటికే రెండు పరాజయాలు మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో చావుదెబ్బ తిన్న భారత్.. తర్వాత పోరులో న్యూజిలాండ్ పై కూడా తలవంచింది. సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కూడా టీమిండియా పేలవ ప్రదర్శన చేసి విమర్శల పాలైంది. ఇక ఇప్పుడు భారత్.. సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్.. తర్వాత ఆడే మ్యాచ్ (ప్రస్తుతం స్కాట్లాండ్ తో కలిపి) లలో ఏదో ఒకదాన్లో ఓడిపోవాలి. అలాగే భారత్ కూడా వరుసగా మూడు మ్యాచ్ లు గెలిస్తే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

Scroll to load tweet…

కాగా.. ఇదే నేపథ్యంలో స్కాట్లాండ్ కీపర్ క్రాస్ కూడా గ్రీవ్స్ ను ఎంకరేజ్ చేశాడు. పరోక్షంగా ‘ఈ మ్యాచ్ మనం గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట అందరి మనసులూ (ముఖ్యంగా టీమిండియ ఫ్యాన్స్) హృదయాలు గెలుచుకుంటున్నది. 

స్కాట్లాండ్ ఆల్ రౌండరైన క్రిస్ గ్రీవ్స్.. ఈ ప్రపంచకప్ లో ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు స్కాట్లాండ్ ఆడిన రెండు మ్యాచులలో అతడు 84 పరుగులు చేయగా.. బంతితో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అబుదాబిలో జరుగుతున్న కివీస్ తో పోరులో మూడు ఓవర్లు వేసి వికెటేమీ తీయకుండా 26 పరుగులిచ్చాడు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 54 బంతుల్లో 96 పరుగుల చేయాలి. క్రిస్ గ్రీవ్స్ ను ఎంకరేజ్ చేసిన కీపర్ మాథ్యూ క్రాస్.. 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు కూడా ఉన్నాయి.