T20 World Cup 2021: చివరి నాలుగు ఓవర్ల దాకా తమచేతిలో ఉన్న మ్యాచును ఒక్కసారిగా ఆసీస్ లాగేసుకోవడం.. హసన్ అలీ కీలక క్యాచ్ వదిలేయడం..  పాక్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. అయితే ఇదే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం సంబురాలు జరుపుకుంటున్నారు. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో అపజయమెరుగని జట్టుగా సెమీస్ కు చేరిన పాకిస్థాన్ కు చుక్కెదురైంది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ రెండో సెమీస్ లో 5 వికెట్ల తేడాతో పాక్ ఓడింది. టోర్నీ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన పాక్ జట్టు.. సెమీస్ లో విజయం ముంగిట బొక్క బోర్లా పడటాన్ని ఆ దేశపు క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి నాలుగు ఓవర్ల దాకా తమచేతిలో ఉన్న మ్యాచును ఒక్కసారిగా ఆసీస్ లాగేసుకోవడం.. హసన్ అలీ కీలక క్యాచ్ వదిలేయడం.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన షహీన్ షా అఫ్రిది తన ఆఖరు ఓవర్లో మూడు సిక్సులు ఇవ్వడం.. పాక్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. అయితే ఇదే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం సంబురాలు జరుపుకుంటున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే భారత నెటిజనుల ఆనందానికి అవధుల్లేవు. ఈ మెగా ఈవెంట్ లో గత నెల 24న పాకిస్థాన్.. టీమిండియాను ఓడించినప్పుడు దాయాది దేశపు అభిమానులు చేసుకున్న సంబురాలే ఇప్పుడు ఇండియా ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

పాకిస్థాన్ కు తగిన శాస్తి జరిగిందని కొందరు అభిమానులు మీమ్స్ తో సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, పాక్ ఓటమికి కారణంగా ఆ దేశపు అభిమానులు భావిస్తున్న హసన్ అలీ లపై మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. అందులో కొన్ని.. 

View post on Instagram

సాధారణ అభిమానులే కాదు.. పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా పాకిస్థాన్ ఓటమిపై ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. పాక్ పరాజయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘కర్మ అనుభవించాల్సిందే..’ అని అర్థమొచ్చే రీతిలో ట్వీట్ చేశాడు. ఇక టర్బోనేటర్ హర్భజన్ కూడా పాక్ పేరు ఎత్తకుండానే ఆ దేశాన్ని ట్రోల్ చేశాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

తెలుగులో కూడా అభిమానులు పలు మీమ్స్ తో ఆకట్టుకుంటున్నారు. పాక్ ఓటమిపై వాళ్లు క్రియేట్ చేసిన మీమ్స్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

View post on Instagram

View post on Instagram

ఇక గురువారం ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (67), బాబర్ (39), ఫకార్ (55) రాణించారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా.. వార్నర్ (49), స్టాయినిస్ (40నాటౌట్), మాథ్యూ వేడ్ (41 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆ జట్టును ఫైనల్స్ కు చేర్చారు. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఆదివారం జరుగనున్నది.