Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: ఛీఛీ అలా చేయడానికి సిగ్గుగా లేదా? వార్నర్ భాయ్ పై గంభీర్ ఫైర్.. సాలిడ్ రిప్లై ఇచ్చిన అభిమాని

Australia Vs Pakistan: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ చేసిన పని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కు కోపం తెప్పించింది. అలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా..? అంటూ గంభీర్.. వార్నర్ భాయ్ పై నిందలు మోపాడు.

ICC T20 World Cup 2021: Aus vs Pak Gautham Gambhir not happy with David Warner Act, says its Shameful
Author
Hyderabad, First Published Nov 12, 2021, 11:41 AM IST

టీ20 ప్రపంచకప్ లో నిన్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది. మాథ్యు వేడ్, మార్కస్ స్టాయినిస్ ల పోరాటపటిమతో ఈ టోర్నీలో అపజయమెరుగని పాకిస్థాన్ ను ఆస్ట్రేలియా ఇంటికి పంపించింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు డేవిడ్ వార్నర్ గట్టి  పునాధి వేశాడు. అయితే  ఈ  మ్యాచ్ లో వార్నర్ చేసిన ఓ పని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కు కోపం తెప్పించింది. అలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా..? అంటూ గంభీర్.. వార్నర్ భాయ్ పై నిందలు మోపాడు. 

అసలేం జరిగిందంటే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో కంగారూలు.. తొలి ఓవర్లోనే ఆరోన్ ఫించ్ వికెట్ ను కోల్పోయారు. వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ కూడా  పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు.  కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న డేవిడ్ వార్నర్.. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలొ ఇన్నింగ్స్ 8 వ ఓవర్ వేసిన పాక్ బౌలర్ హఫీజ్ బౌలింగ్ లో ఓ చిత్ర జరిగింది. 

బంతి వేయడంలో నియంత్రణ  కోల్పోయిన హఫీజ్.. క్రీజుకు దూరంగా విసిరాడు. అది డెడ్ బాల్.  వార్నర్ కు దూరంగా రెండు సార్లు బౌన్స్ అయిన బంతిని అతడు.. ముందుకొచ్చి ఆడాడు. అది సింగిల్, డబుల్ కూడా కాదు. ఏకంగా సిక్సరే. అంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించాడు. వార్నర్ తెచ్చిన ఈ పనే గంభీర్ కు కోపం తెప్పించింది. నో బాల్ ను సిక్స్ ఎలా కొడతావంటూ వార్నర్ ను ప్రశ్నించాడు. 

 

ట్విట్టర్ ద్వారా స్పందించిన గంభీర్.. ‘వార్నర్ క్రీడా స్ఫూర్తిని ఎంత దయనీయంగా ప్రదర్శించాడు. ఇది నిజంగా అవమానకరం’ అని ట్వీట్ చేశాడు. అంతేగాక దీనిపై  స్పందించాలని  టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా అభిప్రాయం కోరాడు. క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయాలపై చర్చలకు దిగే అశ్విన్ ను అభిప్రాయం అడగడంతో  గంభీర్ కొత్త వివాదానికి తెరలేపాడు. అయితే  ఈ ట్వీట్ కు వార్నర్ ఫ్యాన్ ఒకరు..  అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అదీ తెలుగులో..

 

కాగా.. గురువారం నాటి మ్యాచులో వార్నర్ భాయ్ ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే తాను ఔటైన విధానాన్ని చూస్తే మాత్రం అతడిని దురదృష్టం వెన్నాడిందని  అనిపించకమానదు.  షాదాబ్ వేసిన 11 వ ఓవర్లో వేసిన ఫ్లిక్ బంతి.. వార్నర్ బ్యాట్ కు తాకలేదు.  కానీ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. వార్నర్ కూడా తాను ఔటేమోనని భావించి పెవిలియన్ కు వెళ్లాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. వార్నర్ భాయ్ రివ్యూకు  వెళ్తే బావుండేదని మ్యాచ్ అనంతరం అతడి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా మ్యాచ్ ఆసీస్ గెలవడంతో ఆ జట్టుతో పాటు వార్నర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ చేసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios