కరాచీ: భారత్ మీద పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ విషం కక్కారు. ఐసిసికి భారత్ పై విషం కక్కతూ ఓ విజ్ఞప్తి చేశాడు. విదేశీ క్రికెటర్ల పర్యటనకు ఇండియా సురక్షితం కాదని, అందువల్ల ఆ విషయంపై ఐసిసి ప్రకటన చేయాలని ఆయన అన్నాడు. 

ఇండియా ఎప్పటికి కూడా ఇక సురక్షితం కాదని, ఇండియా కన్నా ఇతర చాలా ఉత్తమమని ఆయన అన్నారు. ఇండియాలో ఆ దేశ ప్రజలు వారిలో వారే పోట్లాడుకుంటున్నారని, అందువల్ల సురక్షితం కాదని అన్నాడు. 

ఒక్క సారి ఇండియా వైపు చూడాలని, అక్కడేం జరుగుతోందో చూడాలని, ఐసిసి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని మియాందాద్ అన్నారు. ఐసిసికి తాను చెప్పేది ఒక్కటేనని, భారత్ లో పర్యటించకుండా క్రికెట్ ఆడే దేశాలని అడ్డుకోవాలని ఆయన అన్నారు. తాను ఐసిసికి ఆ సూచన చేశానని, ఐసిసి నుంచి ఏ విధమైన సూచన వస్తుందో వేచి చూడాలని ఆయన అన్నారు. 

ఇప్పుడు వారేం చేస్తారో, ప్రపంచానికి వారు ఏమని చెబుతారో చూడాలని మియాందాద్ అన్నాడు. ఇంతకు ముందు పీసీబీ చైర్మన్ ఇషాన్ మణి భారత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.