మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వరల్డ కప్ మెగా టోర్నీలో క్రికెట్ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసిసి సిద్దమయింది. అందులో భాగంగా అభిమానుల కోసం ఓ ప్రత్యేక ప్రపంచ కప్ గీతాన్ని రూపొందించిన ఐసిసి శుక్రవారం విడుదల చేసింది. ప్రేక్షకులు క్రికెట్ మజాతో పాటు ఉర్రూతలూగించే మ్యూజిక్ మజాను కూడా ఈ ప్రపంచ కప్ లో ఆస్వాదించనున్నారన్నమాట. 

''స్టాండ్‌ బై'' పేరిట సాగే ఈ ప్రపంచ కప్ గీతాన్ని   ప్రఖ్యాతి బ్రిటిష్ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘రుడిమెంటల్‌’ సహకారంతో రూపొందించారు. నూతన గాయకుడు లోరిన్‌ దీన్ని అద్భుతంగా ఆలపించాడు. ఈ నెల   30 నుంచి ప్రపంచకప్‌ జరిగే ప్రతి మైదానం ఈ పాట సందడి చేయనుంది.  

ఇలా ఈ మెగా టోర్నీ జరిగే నెలన్నరపాటు ఆటతో పాటు ఈ పాట అభిమానులను అలరించనుంది.  అంతర్జాతీయంగా 10 జట్లు 48 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఈ  మ్యాచులు జరిగే  సమయంలో వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్  మైదానంలో ప్లే చేస్తారు. ఇంగ్లాండ్ లో ఈ మెగా  టోర్నీ జరగనుంది... కాబట్టి లోకల్ బ్యాండ్ రూపొందించిన ఈ సాంగ్ కు ఆ దేశ ప్రజల నుండే ఎక్కువ స్పందన వస్తోంది.