దుబాయ్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ టాప్ లేపాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఒక్కసారిగా 146 స్థానాలు ఎగబాకాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 100లోకి దూసుకొచ్చాడు. 

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో సైనీ ఐదు వికెట్లు సాధించాడదు. తొలి టీ20లో రెండు వికెట్లు తీసిన సైనీ రెండో టీ20లో మూడదు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఒక్కసరిగా సైనీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో 146 స్థానాలు ఎగబాకాడు. దాంతో 98 స్థానానికి చేరుకున్నాడు. 

మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్ 92వ స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్ లో ఐదు వికెట్లు సాధించడమే కాకుండా మూడో టీ20లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. 

బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో కేఎల్ రాహుల్ తన 6వ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. శ్రీలంకతో 45, 54 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ 26 పాయింట్లు సాధించాడు. దాంతో 760 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 683 పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకాడు. శిఖర్ ధావన్ ఒక్క స్థానం ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.