Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికే అంచనా: వరల్డ్ కప్ జుట్టు ఎంపికపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్

ఈ విషయంపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ కి రాకముందే, వరల్డ్ కప్ టీమ్ ని తాము డిసైడ్ అయినట్లు చెప్పారు. నేపాల్ తో మ్యాచ్ గెలిచిన విషయంపై మాట్లాడుతూనే,  వరల్డ్ కప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ICC ODI World Cup 2023 Team India Squad Announcement ram
Author
First Published Sep 5, 2023, 12:25 PM IST

ఆసియాకప్ 2023టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది. పాక్ తో మ్యాచ్ రద్దు అయినా, నేపాల్ తో మ్యాచ్ మాత్రం సునాయాసంగా గెలిచింది. తొలుత ఈ మ్యాచ్ లో తడపడినా, చివరకు నిలపడి విజయం సాధించింది. పాకిస్తాన్ తో మరోసారి సెప్టెంబర్ 10వ తేదీన  ఆడనుంది. అయితే, అందరి ఫోకస్ అంతా వరల్డ్ కప్ పైనే పడింది. వరల్డ్ కప్ 2023 జట్టు ఎప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే,  ప్రాథమిక జట్టును ఈ రోజే ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ విషయంపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ కి రాకముందే, వరల్డ్ కప్ టీమ్ ని తాము డిసైడ్ అయినట్లు చెప్పారు. నేపాల్ తో మ్యాచ్ గెలిచిన విషయంపై మాట్లాడుతూనే,  వరల్డ్ కప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.


నేపాల్ తో మ్యాచ్ విషయంలో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ నిజాయితీగా చెప్పాలంటే సంతోషంగా లేదని చెప్పాడు. మ్యాచ్ మొదట్లో కాస్త నిదానంగా ఆడాల్సి వచ్చిందన్నాడు. అయితే, క్రీజులో కుదరుకున్న తర్వాత పరుగులు చేయడం చాలా సులువైందని చెప్పాడు. షార్ట్ ఫైన్ లెగ్, డీప్ బ్యాక్ వర్డ్ స్వ్కేర్ లెగ్ వైపు షాట్లు అప్పటికప్పుడు అనుకొని కొట్టామని  చెప్పాడు.

ఇక, వరల్డ్ కప్ టీమ్ గురించి అడిగినప్పుడు ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యామని చెప్పాడు. ఆసియా కప్ కి రాకముందే, ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ఉన్న టీమ్ నుంచే ఒకరిద్దరి తొలగించే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు జరిగిన రెండు మ్యాచుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.

ఇప్పుడు జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఏదీ సంపూర్ణంగా ఆడలేకపోయామని, కొందరు టీమ్ లోకి కొత్తగా వచ్చారని  చెప్పారు. కాబట్టి, దీని ఆధారంగా టీమ్ ని నిర్ణయించలేదని చెప్పాడు. మరి, ఎవరెవరికి చోటు దక్కిందో తెలియాలంటే, ఈ రోజు ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడబోతోంది. ఇక ఆసియా కప్ విషయానికి వస్తే నిన్న నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఇండియా సూపర్ 4లో అడుగుపెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios