Asianet News TeluguAsianet News Telugu

ICC World Cup 2023 : బంతితో మాట్లాడే మాయగాడు మన పాండ్యా... చెవిలో చెప్పినట్లే చేసిందిగా..!

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో కూడా మట్లాడగలడా... అతడు చెప్పింది విని ఆ బంతి పాకిస్థాన్ ఓపెనర్ వికెట్ పడగొట్టిందా..? అనే సరదా చర్చ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. 

ICC Cricket World Cup 2023 ... Team india bowler Pandya talks with bowl in India vs Pakistan match AKP
Author
First Published Oct 15, 2023, 8:59 AM IST

అహ్మదాబాద్ : ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లో కీలకమైన  దాయాదుల పోరు ముగిసింది. నిన్న శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో... యావత్ ప్రపంచమే ఆశ్యర్చపోయేలా కిక్కిరిసిన అభిమానులు మధ్య... ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. సమఉజ్జీల మధ్య సమరం అనుకున్న ఈ మ్యాచ్ కాస్తా ఓ పనికూనతో టీమిండియా ఆటాడుకున్నట్లు కనిపించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ 2023 లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. 

అయితే పాకిస్థాన్ తో పోరులో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి బంతిని అందించాడు. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని భావించాడో ఏమో చాలా కసితో బౌలింగ్ చేయసాగాడు పాండ్యా. అప్పటికే పాకిస్థానీ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ తో కలిసి మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతుండగా పాండ్యా ఓ మ్యాజిక్ బంతితో ఇమామ్ ను బురిడీకొట్టింది వికెట్ ను తన ఖాతాలోకి వేసుకున్నాడు. 

ఇమామ్ వికెట్ తీసేముందు పాండ్యా బంతి చెవిలో ఏదో చెబుతున్నట్లు కనిపించాడు. మాయ చేసాడో లేక బంతి మంత్రమేసాడో తెలీదుగానీ... పాండ్యా చెప్పిన మాట ఆ బాల్ విన్నట్లుంది. అంతకు ముందు బంతిని బౌండరీ దాటించి దూకుడుమీద కనిపించిన ఇమామ్ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దూరంగా వెళుతున్న బంతిని ఆడబోయి కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పాక్ ఓపెనర్. 36 పరుగుల వద్ద రెండో వికెట్ పడగొట్టి రోహిత్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పాండ్యా. 

Read More  ICC World Cup 2023 : నేను ఇలాంటి ఆనంద తాండవమే చేస్తున్నాను..: పాక్ పై భారత్ సూపర్ విక్టరీపై ఆనంద్ మహింద్రా

అయితే ఇమాన్ ను ఔట్ చేసే ముందు పాండ్యా బంతితో మాట్లాడటంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికర కామెంట్ చేస్తున్నారు. ''పాండ్యా అన్న చెబితే బంతి కూడా మాట వినాల్సిందే... వికెట్ పడాల్సిందే'' అంటూ కొందరు కామెంట్స్ చేసారు. ఇంకొందరు ''పాండ్యా పెద్ద మాయగాడిలా వున్నాడే... బంతికి మంత్రమేసి పాక్ ఓపెనర్ ను మాయ చేసాడు'' అంటున్నారు. ఇలా హార్దిక్ పాండ్యా బంతి చెవిలో ఏదో చెబుతున్నట్లు వున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios