Asianet News TeluguAsianet News Telugu

ICC: 2021 వన్డే, టెస్టు జట్లను ప్రకటించిన ఐసీసీ.. ప్చ్..! టీమిండియాకు మళ్లీ నిరాశే..

ICC ODI Team Of The Year 2021: టీమిండియాకు ఐసీసీ మరోసారి మొండిచేయి చూపించింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే టీమ్ ఆఫ్ ది ఈయర్ లో కూడా భారత జట్టుకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. 
 

ICC Announce Men's ODI and Test Team Of The Year 2021, no Indian Player Included In White Ball Cricket
Author
Hyderabad, First Published Jan 20, 2022, 3:33 PM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు మరోసారి షాకిచ్చింది. మంగళవారం ట్విట్టర్ వేదికగా.. టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్-2021ను ప్రకటించిన ఐసీసీ అందులో ఒక్కరంటే ఒక్క భారతీయ క్రికటర్ ను కూడా చేర్చేలేదు. ఇక తాజాగా 2021 ఏడాదికి గాను పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఈయర్, టెస్టు టీమ్ ఆఫ్ ది ఈయర్ ను ప్రకటించినా అందులో కూడా  భారత్ కు నిరాశ తప్పలేదు. టీ20 జట్టులో మాదిరే..  ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టులో కూడా భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు. టెస్టులలో  భారత్ ను అగ్రస్థానాన నిలబెట్టిన మాజీ సారథి విరాట్ కోహ్లికి టెస్టు జట్టులో చోటు లేకపోవడం గమనార్హం. 

ఈ మేరకు బుధవారం ఐసీసీ.. తన ట్విట్టర్ వేదికగా 2021కి గాను పురుషుల వన్డే జట్టు, టెస్టు జట్టును ప్రకటించింది. టీ20 జట్టు మాదిరే వన్డే జట్టుకు కూడా పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ కు సారథ్యాన్ని అప్పజెప్పింది ఐసీసీ. టెస్టులకు మాత్రం ఆ బాధ్యతలను న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కు దక్కాయి. 

 

వన్డేలలో ఓపెనర్లుగా జేన్మన్ మలన్ (దక్షిణాఫ్రికా), పార్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) లను ఎంచుకున్న ఐసీసీ.. పాకిస్థాన్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్ లను తర్వాత స్థానంలో నిలిపింది. మరో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్  రస్సీ వన్ డర్ డసెన్ కు ఐదో స్థానం, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ ఉల్  హసన్ కు ఆరు, వికెట్ కీపర్ ముష్ఫకీర్ రహీమ్ కు ఏడో స్థానం కట్టబెట్టింది. ఆ తర్వాత జాబితాలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సిమి సింగ్, దుష్మంత చమీర ఉన్నారు. 

ఐసీసీ మెన్స్ టీమ్ ఆఫ్ ది ఈయర్ : పాల్ స్టిర్లింగ్, జేన్మన్ మలన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫకర్ జమాన్, రస్సీ వన్ డర్ డసెన్, షకీబ్ ఉల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సిమి సింగ్, దుష్మంత చమీర 

టెస్టు జట్టులో హిట్ మ్యాన్, రిషభ్ పంత్, అశ్విన్ : 

 

టీ20, వన్జే జట్లలో ప్రాతినిథ్యం కోల్పోయిన భారత జట్టు.. టెస్టులలో  మాత్రం అదరగొట్టింది. భారత పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.  

ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఈయర్ : దిముత్ కరుణరత్నే,  రోహిత్ శర్మ, మార్నస్ లబూషేన్, జో రూట్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫవాద్ ఆలం, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, కైల్ జెమీసన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది

Follow Us:
Download App:
  • android
  • ios