Asianet News TeluguAsianet News Telugu

కామెంటేటర్‌గా తప్పుకున్న ఇయాన్ చాపెల్... 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కి ఫుల్‌ స్టాప్...

45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్... ఆరోగ్య సమస్యలతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటన.. 

Ian Chappell retires from cricket Commentary after 45 long years with health reasons
Author
India, First Published Aug 15, 2022, 5:40 PM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్... కామెంటరీ కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరుపున 75 టెస్టులు, 16 వన్డేలు ఆడిన ఇయాన్ చాపెల్, 45 ఏళ్లుగా కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. తాను ఆడిన 75 టెస్టుల్లో 30 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ చాపెల్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్‌కి స్వయంగా అన్న... 

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత 1980లో పూర్తి స్థాయి కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు ఇయాన్ చాపెల్. రిటైర్మెంట్‌కి ముందే కొన్ని మ్యాచులకు కామెంటేటర్‌గా తన గొంతును అందించిన ఇయాన్ చాపెల్, 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించాడు...

‘క్రికెట్ ఆట నుంచి తప్పుకున్న రోజు నేను గడియం వైపు చూశా. అప్పుడు సరిగ్గా 11 గంటలు దాటి 5 నిమిషాలు అవుతోంది... ఆ రోజు మ్యాచ్ ఉంది. నేను ఎలాగైనా వెళ్లాలి.. అని మనసులో అనుకున్నా... అప్పుడే కామెంటేటర్‌గా మారాలనే ఆలోచన వచ్చింది...

కామెంటేటర్‌గా నేను సంతృప్తి పొందాను. కొన్ని ఏళ్ల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. అయినా లక్కీగా క్షేమంగా బయటపడ్డా. అయితే ఇప్పుడు పరిస్థితి రోజురోజుకీ కఠినంగా మారుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం చేయడం, మెట్లు ఎక్కడం... కరెక్ట్ కాదని వైద్యులు సూచించారు. అందుకే ఇక కామెంటరీకి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. ఇది నా మనసును చాలా బాధపెతుతోంది. అయితే తప్పక తీసుకుంటున్న నిర్ణయం...’ అంటూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్...

ఆస్ట్రేలియా స్పోర్ట్స్ ఛానెల్ ‘ఛానెల్ 9’తో ఇయాన్ చాపెల్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. అయితే ఈ ఛానెల్ యజమాని కెర్రీ ప్యాకర్, చాలాసార్లు ఇయాన్ చాపెల్‌ను తప్పించాలని చూశాడట. ఈ విషయాన్న స్వయంగా వెల్లడించాడు ఈ ఆసీస్ మాజీ కెప్టెన్...

‘కెర్రీ... నన్ను చాలాసార్లు కామెంటరీ నుంచి తప్పించాలని చూశాడు. అతనికి వన్డే క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కెర్రీకి చాలా డబ్బులు తెచ్చిపెట్టింది అదే. అందుకే నేను వన్డే క్రికెట్ గురించి చేసే కామెంట్లు ఆయనకి నచ్చేవి కావు. ఈ విషయంలో చాలా సార్లు నాతో గొడవ పడ్డాడు. అయితే ఆ గొడవ ఎప్పుడూ హద్దులు దాటలేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్..

78 ఏళ్ల ఇయాన్ చాపెల్, చర్మ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అలాగే వృద్ధాప్య వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇయాన్ చాపెల్ తమ్ముళ్లు గ్రెగ్ చాపెల్, ట్రేవర్ చాపెల్ కూడా ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి ఆడారు. ఆసీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్, 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.. 1981 వన్డే వరల్డ్ కప్ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తమ్ముడు ట్రేవర్ చాపెల్‌తో అండర్ ఆర్మ్ బాల్ వేయించి, వివాదాల్లో ఇరుక్కున్నాడు గ్రెగ్ చాపెల్...

సౌతాఫ్రికా విజయానికి ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాల్సి రాగా, ట్రేవర్ చాపెల్‌ను అండర్ ఆర్మ్ బాల్ వేయాల్సిందిగా అప్పటి ఆసీస్ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ సూచించాడు. దీంతో చివరి బంతికి పరుగులు చేయలేకపోయాడు కివీస్ బ్యాటర్ బ్రియాన్ మెక్‌కెచ్‌నీ. ఈ సంఘటన తర్వాత అండర్‌ఆర్మ్ బౌలింగ్‌ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.. 

Follow Us:
Download App:
  • android
  • ios