ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కన్ సంచలన ప్రకటన చేశాడు. తాను స్వలింగ సంపర్కుడినని వెల్లడించి కలకలం రేపాడు. ఆదివారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా ఫాల్కనర్‌ ఆ విషయాన్ని తెలియజేశాడు.

బాయ్‌ఫ్రెండ్‌ రాబర్ట్ జబ్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా.. బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే డిన్నర్ అంటూ రాబర్ట్‌తో కలిసుున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఫాల్కనర్ ఆసీస్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు.