Asianet News TeluguAsianet News Telugu

థ్యాంక్స్ సరిపోదు, క్రెడిట్ అంతా ఆయనదే.. అశ్విన్

తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో అదరగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. కాగా.. తన స్కోర్ మూడంకెలు దాటగానే మహ్మద్ సిరాజ్ ఉద్వేగం చూసి తాను ఆశ్చర్యపోయానని అశ్విన్ పేర్కొన్నాడు.

I would love to credit him': R Ashwin names individual responsible for his batting resurgence
Author
Hyderabad, First Published Feb 16, 2021, 8:39 AM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ షోతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో అదరగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. కాగా.. తన స్కోర్ మూడంకెలు దాటగానే మహ్మద్ సిరాజ్ ఉద్వేగం చూసి తాను ఆశ్చర్యపోయానని అశ్విన్ పేర్కొన్నాడు.

‘ ప్రస్తుతం నా ఆలోచన.. రేపటికి ఎలా కోలుకుంటానో, రాత్రి ఎలా నిద్రపడుతుందోనని మాత్రమే. అయితే గత కొన్ని మ్యాచుల్లో నా బ్యాటింగ్ మెరుగవ్వడానికి కారణం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. కొత్త టెక్నిక్ లతో అతను సాయం చేశాడు. అతనికే ఈ క్రెడిట్ ఇవ్వాలి. మళ్లీ సొంత మైదానం( చెన్నై) లో టెస్టు మ్యాచ్ ఎప్పుడు ఆడతానో తెలీదు.. అయితే.. ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉంది. మద్దతుగా నిలిచిన అభిమానులకు దన్యవాదాలు తెలపడానికి కేవలం థ్యాంక్స్ అన్న చిన్న మాట సరిపోాదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

‘ గతంలో టెస్టు మ్యాచుల్లో సెంచరీలు చేసినప్పుడు ఇషాంత్ శర్మ మరో ఎండ్ లో ఉండేవాడు. అయితే ఇప్పుడు సిరాజ్ ఉన్నాడు. బంతి లైన్ ను గమనిస్తూ బ్యాటింగ్ చేయమని సిరాజ్ కు సూచించాను. అయితే.. నేను సెంచరీ చేసినప్పుడు సంతోషంతో అతను చేసిన సంబరాలు చూసి ఆశ్చర్యపోయా. మా డ్రెస్సింగ్ రూమలో అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

అశ్విన్ వ్యక్తిగత స్కోరు 78 వద్ద టీమిండియా 9వ వికెట్  కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆఖరి బ్యాట్స్ మెన్ గా వచ్చిన సిరాజ్ చక్కని డిఫెన్స్  తో అశ్విన్ సెంచరీ పూర్తి చేశాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో బౌండరీ బాది అశ్విన్ సెంచరీ చేశాడు. అయితే.. ఆ సమయంలో సిరాజ్ ఆనందంతో గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేయగా.. అది వైరల్ అయ్యింది. సిరాజ్ వ్యక్తిత్వాన్ని నెటిజన్లు సైతం అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios